The Best Waterfalls in Telangana : రాష్ట్రంలో జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతాలు కట్టిపడేస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం ప్రకృతి సోయగాలతో సందడి చేస్తోంది. కొండ నుంచి జాలువారుతున్న జలధారా ప్రతి ఒక్కరినీ కట్టిడేస్తోంది. ఈ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. ప్రకృతి సోయగాలను తిలకిిస్తూ.. ఆనందంతో మైమరచిపోతున్నారు. మరోవైపు.. వరద తీవ్రత ఎక్కువగా ఉన్నందున సందర్శకులను నీటిలో దిగేందుకు అధికారులు అనుమతించడం లేదు. ఈ జలపాతం తెలంగాణ నయాగరాగానూ పేరు గాంచింది. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి 329 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలి.
Bogotha waterfalls in Mulugu : అభివృద్ధికి ఆమడ దూరంలో బొగత జలపాతం.. ఎక్కడ చూసినా..!
Jadi Malkapur Waterfalls : వాగులు, వంకల నుంచి వచ్చి చేరుతున్న కొత్తనీటితో నదులు, జలపాతాలు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో ఉన్న జాడి మల్కాపూర్ జలపాతాలు కొత్తగా ఏర్పడ్డాయి. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ నెల 20న ఉదయం జలపాతం ఉప్పొంగి, జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. అంతర్రాష్ట్ర సరిహద్దులోని జాడి మల్కాపూర్ జలపాతం సందర్శనకు సంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్, గుల్బర్గా, బీదర్, వికారాబాద్ జిల్లాల పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. జలపాతాన్ని చూసేందుకు వస్తున్న సందర్శకులు సెల్ఫీలు దిగుతూ సంతోషంగా గడుపుతున్నారు. అటవీ ప్రాంతంలో భారీ గుట్టల మధ్య జలజల రావాలు చేస్తూ కనిపించే జలపాత సోయగాలు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కానీ ఇక్కడ పర్యాటకులకి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగునీరు దొరకని పరిస్థితి. రోడ్డు మార్గం కూడా సరిగా లేకపోవడం రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు హోటళ్లు, రాత్రివేళ ఉండేందుకు గుడారాలు, రవాణా మార్గాన్ని మెరుగుపరచాలని పర్యాటకులు విజ్ఞాప్తి చేస్తున్నారు. ఈ ప్రదేశం జహీరాబాద్ పట్టణానికి 25 కి.మీ, హైదరాబాద్కు 120 కిలోమీటర్ల దూరంలోని ఉంది.