తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉప్పలపాడులో నీటికుక్కల సందడి..పెరిగిన సందర్శకుల తాకిడి

ఇప్పటివరకూ అదొక పక్షుల సంరక్షణ కేంద్రం. ఎక్కడి నుంచి వచ్చాయో.. అనుకోని అతిథులు ఆటలు మొదలుపెట్టాయి. చెరువులో చేపలను భోంచేస్తూ అక్కడే మకాం వేశాయి. అరుదైన జాతికి చెందిన ఆ ప్రాణులు సందర్శకులకు సరికొత్త అనుభూతులు పంచుతున్నాయి. ఉప్పలపాడులోని పక్షుల సంరక్షణ కేంద్రానికి సరికొత్త ఆకర్షణగా మారిన నీటి కుక్కలపై ప్రత్యేక కథనం.

By

Published : Mar 26, 2021, 10:42 PM IST

ap guntur, neeti kukkalu
attar, neeti kukkalu, uppalapadu, birds protection center

ఉప్పలపాడులో నీటికుక్కల సందడి..పెరిగిన సందర్శకుల తాకిడి

ఏపీలోని గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో ఎక్కడినుంచో వచ్చి చేరిన నీటికుక్కలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి చెరువులో ఉండే చెట్లపై విదేశీ పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకొని వెళ్తుంటాయి. ఓరోజు హఠాత్తుగా చెరువులో నీటి కుక్కలు కనిపించటం సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన అడపాదడపా నీటి కుక్కలు కనిపిస్తుంటాయి. అక్కడి నుంచి కృష్ణా కాలువల ద్వారా ఉప్పలపాడు చెరువులోకి చేరి ఉంటాయని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం డజనుకు పైగా నీటి కుక్కల్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు.

నీటి కుక్కల రాకతో... పర్యటకుల సందడి

చూసేందుకు ముంగిసలాంటి తలతో.... సీల్ చేపను తలపించే నీటికుక్కల శాస్త్రీయ నామం అట్టర్. పెద్దగా అలికిడి లేని నీటి వనరులున్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా జీవిస్తాయి. నీటితో పాటు నేలపైనా ఉండగలవు. చేపలు వాటికి ప్రధానాహారం. ఉప్పలపాడుకు ఏటా తరలివచ్చే 50 రకాల విదేశీ పక్షులను చూసేందుకు సందర్శకులు తరలి వస్తుంటారు. ఇప్పుడు నీటి కుక్కలు రావడం అదనపు ఆకర్షణగా మారింది. ఉప్పలపాడు చెరువులో చేపలు విస్తారంగా ఉన్నందున నీటికుక్కలకు సమృద్ధిగా ఆహారం దొరకనుంది. కుదిరితే అప్పుడప్పుడూ పక్షులనూ ఆరగిస్తాయి.

సందర్శకుల వెల్లువ

పెద్దపెద్ద నీటి వనరుల్లో నీటికుక్కలు కనిపించే అవకాశాలు తక్కువ. ఇది చిన్న చెరువు కావడంతో వాటి ఆటలు చూసే అవకాశం సందర్శకులకు దొరకనుంది.

ఇవీ చదవండి:పొగడ్తలతో సరిపెట్టేస్తున్నారు.. నిధులివ్వడం లేదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details