తెలంగాణ

telangana

By

Published : Apr 18, 2020, 7:09 AM IST

ETV Bharat / state

రవాణాలో విశాఖలోని వాల్తేర్‌ డివిజన్‌ సరికొత్త రికార్డు

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం విశాఖలోని వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ ఆదాయ ఆర్జనలో దేశంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దాదాపు 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ డివిజన్.. రూ. ఎనిమిదిన్నర వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి.. గతంలోని రికార్డులను తిరగరాసింది. 66.81 మిలియన్‌ టన్నుల కార్గోను రవాణా చేసి.. తూర్పుకోస్తా రైల్వేలోనే ముందజంలో నిలిచింది.

రవాణాలో విశాఖలోని వాల్తేర్‌ డివిజన్‌ సరికొత్త రికార్డు
రవాణాలో విశాఖలోని వాల్తేర్‌ డివిజన్‌ సరికొత్త రికార్డు

తూర్పుకోస్తా రైల్వేలో అతి ముఖ్యమైన ఏపీ విశాఖలోని వాల్తేర్‌ డివిజన్‌ 2019-20 ఆర్ధిక సంవత్సరంలో.. మంచి వృద్ధి రేటును నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే మొత్తం ఆదాయంలో పది శాతం, సరకు రవాణాలో 7.91 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 3 కోట్ల 58 లక్షల మంది ప్రయాణికులను చేరవేసింది. రూ. 8 వేల 500 కోట్ల ఆదాయ ఆర్జన మైలు రాయిని దాటింది. అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూనే ఈ స్థాయికి చేరింది. తూర్పుకోస్తా రైల్వేలో 200.85 మిలియన్‌ టన్నుల సరకు రవాణాలో సింహభాగం వాల్తేర్‌ డివిజన్‌దేనని అధికార వర్గాలు వెల్లడించాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 66.81 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా 8 వేల 166.63 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది గతేడాదితో పోలిస్తే దాదాపు 850 కోట్ల మేర అదనం. 35.86 మిలియన్ల ప్రయాణికుల రవాణా ద్వారా 677.52 కోట్లను సముపార్జించింది. టిక్కెట్ల తనిఖీని ముమ్మరం చేయడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలిగామని అధికారులు తెలిపారు. 2 లక్షలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

సూపర్‌ సైక్లోన్‌లు ఈ ఏడాది బాగా నష్టం కలిగించాయని.. వాటిని ఎదుర్కొంటూనే 10.83 శాతం వృద్దిని నమోదు చేయగలిగామని డీఆర్ఎం చేతన్‌ కుమార్‌ శ్రీవాస్తవ తెలిపారు. అభివృద్ధి, ఆధునికీకరణ పనులనూ పూర్తి చేయగలిగినట్టు ఆయన వివరించారు.

ఇవీ చదవండి:తెలంగాణలో 766కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details