మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చే వాళ్లకు కాకుండా పని చేసే వాళ్లకు ఓటు వేయాలని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రజలకు సూచించారు. అధికార పార్టీ ఐదేళ్లలో చేసిందేమి లేదన్నారు. రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తారనేది ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఓట్లు కొనుక్కునే పరిస్థితి పోవాలి : కోదండరాం - హైదరాబాద్ ఈరోజు వార్తలు
మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచార శైలిని మార్చబోతున్నామని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. మనకు కావాల్సింది సమస్యలను పరిష్కరించగలిగే నాయకులు అన్నారు. ఓట్లను కొనుక్కునే పరిస్థితి పోయి, నాయకులను కోరుకునే పరిస్థితి రావాలన్నారు.
![ఓట్లు కొనుక్కునే పరిస్థితి పోవాలి : కోదండరాం votes but situation changes in telangana municipal elections : Kodandaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5674597-521-5674597-1578738707095.jpg)
ఓట్లు కొనుక్కునే పరిస్థితి పోవాలి : కోదండరాం
ఎన్నికైన కౌన్సిలర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని, అప్పుడే నగరాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సుమారు 400 స్థానాల్లో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలపట్ల మున్సిపాలిటీలు జవాబుదారీతనంగా పనిచేయడమే తెజస లక్ష్యమంటున్న ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
ఓట్లు కొనుక్కునే పరిస్థితి పోవాలి : కోదండరాం
ఇదీ చూడండి : 'తెరాస గతంలో ఇచ్చిన హామీ ఒక్కటీ కూడా నెరవేర్చలేదు'