విజయనగరం బహిరంగ మార్కెట్లలో అధిక ధరలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్ముతున్నారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిజ నిర్ధరణకు జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ నేరుగా రంగంలోకి దిగారు. పల్లెటూరి రైతు వేషం ధరించిన జేసీ... రాజీవ్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబజార్లలో కూరగాయలు కొన్నారు.
మారువేషంలో జేసీ.. అధిక ధరలపై ఆరా... - విజయనగరంలో మారువేషంలో రైతుబజార్‌కు జేసీ కిశోర్ కుమార్
అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజనిజాలు తెలుసుకునేందుకు జేసీ కిశోర్ కుమార్ మారువేషంలో మార్కెట్‌కు వెళ్లారు. పల్లెటూరి రైతు వేషంలో వెళ్లి ధరలు అడిగి తెలుసుకున్నారు. టమాట, ఉల్లిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఆయన గుర్తించారు.
jc
అన్ని సరుకులు, దుకాణాల వద్దకు వెళ్లి సాధారణ వినియోగదారునిలా ధరలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మకాలు జరుగుతున్నాయని, ఉల్లి, టమాటాలను ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తించానని జేసీ తెలిపారు.
ఇవీ చదవండి:రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసులు