తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ ఆస్పత్రిలో శానిటైజేషన్​ పనులపై వీడియో విడుదల - గాంధీ ఆస్పత్రిలో శానిటేషన్​ పనులు

గాంధీ వసతులు లేవనే విమర్శల నేపథ్యంలో శానిటైజేషన్​కు సంబంధించి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వీడియో విడుదల చేశారు. అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో రోగులకు వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.

video-on-sanitation-works-in-gandhi-hospital
గాంధీ ఆస్పత్రిలో శానిటైజేషన్​ పనులపై వీడియో విడుదల

By

Published : Apr 25, 2020, 12:26 PM IST

గాంధీ ఆస్పత్రిలో ప్రతి రెండు గంటలకు ఒకసారి శానిటైజేషన్‌ పనులు చేపడుతున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ రాజారావు తెలిపారు. ఆస్పత్రిలో చేపడుతున్న శానిటైజేషన్‌ ప్రక్రియకు సంబంధించి... వీడియోని సైతం విడుదల చేశారు. గాంధీలో సరైన వసతులు లేవని వస్తున్న విమర్శల నేపథ్యంలో అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో రోగులకు వైద్యం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన రోగులు గాంధీలో అందుతున్న చికిత్సల పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయాన్ని డాక్టర్‌ రాజారావు గుర్తు చేశారు.

గాంధీ ఆస్పత్రిలో శానిటైజేషన్​ పనులపై వీడియో విడుదల

ABOUT THE AUTHOR

...view details