తెలంగాణ

telangana

ETV Bharat / state

గోవిందుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు - వైకుంఠ ఏకాదశి పండుగ

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నగరంలోని వైష్ణవాలయాలు భక్తులతో పోటెత్తాయి. గోవిందుడి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తజనం క్యూలైన్లల్లో బారులు తీరారు.

vaikunta ekadashi festive
గోవిందుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు

By

Published : Jan 6, 2020, 3:08 PM IST

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జంట నగరాల్లోని వైష్ణవాలయాలను పుష్పాలతో సుందరంగా అలంకరించారు. నగరంలోని ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఉత్తర ద్వారం గుండా వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేవాలయాల్లో భక్తులు బారులు తీరారు.

హైదరాబాద్ తార్నాకలోని శ్రీ లక్ష్మీగణపతి సాయిబాబా వేంకటేశ్వర స్వామి ఆలయం, శంషాబాద్​లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయలం, నామాలగుండులోనివేంకటేశ్వర స్వామి ఆలయం, కేపీహెచ్ బీ కాలనీలోనివేంకటేశ్వర దేవాలయంలో, వివేకానంద నగర్ లోని శ్రీ పద్మావతి సమేతవేంకటేశ్వర స్వామి, తులసీవనమ్వేంకటేశ్వర ఆలయాల్లో వేకువ జాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు భారీగా తరలివచ్చారు.

ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. నామాలగుండులోనివేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. స్వామి వారికి భక్తులు రకారకాల పండ్లరసాలు, పూలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

గోవిందుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు

ఇదీ చూడండి: శ్రీ వైకుంఠపురంలో.. వైకుంఠ ఏకాదశి సందడి.!

ABOUT THE AUTHOR

...view details