భారతదేశంలో 130 కోట్లమంది హిందువులేనని ఎలా అంటారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. గత నెల 25న హైదరాబాద్‌లో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ సభలో మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భారతదేశం సెక్యులర్ దేశమని...అన్ని కులాలు, మతాల వారుంటారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాటలను హనుమంతరావు గుర్తు చేశారు. వీటిలో ఏదినిజమో చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకు పీఎస్‌లోనే కూర్చుంటా'
దేశంలో 130 కోట్ల మంది ప్రజలు హిందువులేనని వ్యాఖ్యానించిన ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్‌పై కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ అన్నందుకు కేసు నమోదు చేసి....క్షమాపణ చెప్పించారని... రాహుల్‌కు ఒక న్యాయం... మోహన్ భగవత్‌కు ఒక న్యాయమా అని ప్రశ్నించారు.
రాహుల్‌కు ఒక న్యాయం... మోహన్ భగవత్‌కు ఒక న్యాయమా?
మోహన్ భగవత్‌పై.. తాను ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో డిసెంబరు 30న ఫిర్యాదు చేసినా ఇంతవరకూ చర్యలు తీసుకోలేదన్నారు. రేపు స్టేషన్‌కు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేసేవరకూ ఠాణాలోనే కూర్చుంటానని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలి'