త్వరలో జైల్ భరో కార్యక్రమం చేపడుతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల తీరుకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ గాంధీభవన్లో స్పష్టం చేశారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వనపర్తికి చెందని నాయకులు కాంగ్రెస్లో చేరారు. వారందరికీ ఉత్తమ్ కండువా కప్పి ఆహ్వానించారు. ఇతర పార్టీలోకి వెళ్లిన వారిని కూడా ఆహ్వానిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
'పోలీసుల తీరును నిరసిస్తూ జైల్భరో నిర్వహిస్తాం' - పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల వైఖరీకి నిరసనగా జైల్ భరో కార్యక్రమం చేపడుతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
త్వరలో జైల్ భరో కార్యక్రమం: ఉత్తమ్