ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాజ్యంపై విచారణ జనవరి 6 కి వాయిదా
మున్సిపల్ ఎన్నికలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ ఈ నెల 6కి వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తారని ధర్మాసనానికి న్యాయవాది దామోదర్‌రెడ్డి తెలిపారు. ప్రకాశ్‌రెడ్డి అందుబాటులో లేనందున... గడువు కావాలని కోరారు. అభ్యర్థనను అంగీకరించిన ధర్మాసనం విచారణ ఈనెల 6కి వాయిదా వేసింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా... ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధమని పిటిషన్లో ఉత్తమ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థించారు.
UTTAM KUMAR REDDY PETITION HEARING WILL BE ON 6TH JANUARY