త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 32 జిల్లాలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి సమన్వయకర్తలను నియమించారు. పీసీసీ కార్యవర్గంలోని ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులను సమన్వయకర్తలుగా నియమించారు. ఈ నెల 13,14,15 తేదీలలో మున్సిపాలిటీ పరిధిల్లో సమావేశాలు నిర్వహించాలని ఉత్తమ్ జిల్లా కోఆర్డినేటర్‌లను ఆదేశించారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పురపోరు బరిలో ఉండే అభ్యర్థులను వార్డుల వారిగా సిఫారసు చేయాలని నేతలకు ఉత్తమ్ సూచించారు.
మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తలను నియమించిన ఉత్తమ్ - tpcc
పీసీసీ కార్యవర్గంలోని ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులను మున్సిపల్ ఎన్నికలకు సమన్వయకర్తలుగా నియమించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
సమన్వయకర్తలను నియమించిన ఉత్తమ్