తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌ సీబీఐ ఎస్పీకి కేంద్ర హోం మంత్రి పురస్కారం

కేంద్ర హోంశాఖ 2020 సంవత్సరానికి ‘యూనియన్‌ హోం మినిస్టర్స్‌ మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌’’ ప్రకటించింది. అందులో హైదరాబాద్‌ సీబీఐ ఎస్పీ సెఫాస్‌ కల్యాణ్‌ పాకెర్ల కూడా ఉన్నారు.

By

Published : Aug 13, 2020, 9:50 AM IST

Union Home Minister Award to Hyderabad CBI SP
హైదరాబాద్‌ సీబీఐ ఎస్పీకి కేంద్ర హోం మంత్రి పురస్కారం

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన నేరాల దర్యాప్తులో అద్భుత ప్రతిభ కనబరిచిన 121 మంది పోలీసు సిబ్బందికి కేంద్ర హోంశాఖ 2020 సంవత్సరానికి ‘యూనియన్‌ హోం మినిస్టర్స్‌ మెడల్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఇన్వెస్టిగేషన్‌’’ప్రకటించింది. వీటిలో అత్యధికంగా 15 పతకాలు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కే దక్కటం విశేషం.

ఐఎంఏ(ఐ మానెటరీ అడ్వయిజరీ) కుంభకోణంపై దర్యాప్తు చేసి నిందితుల గుట్టురట్టు చేసిన హైదరాబాద్‌ సీబీఐ ఎస్పీ సెఫాస్‌ కల్యాణ్‌ పాకెర్ల కూడా వీరిలో ఉన్నారు. మహారాష్ట్రలో హేతువాది నరేంద్ర దభోల్కర్‌, కర్ణాటకలో భాజపా నేత యోగేష్‌ గౌడ హత్య, బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ షెల్టర్‌ హోమ్‌ దారుణ ఘటనల కేసులను ఛేదించిన సీబీఐ అధికారులూ పురస్కారాలకు ఎంపికైన వారిలో ఉన్నారు. ఈ ఏడాది కేంద్ర హోం మంత్రి మెడల్స్‌కు ఎంపికైన పోలీసు సిబ్బందిలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి 10 మంది చొప్పున, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 8 మంది, కేరళ, పశ్చిమబెంగాల్‌ నుంచి ఏడుగురు చొప్పున ఉన్నారు. మిగిలిన వారు వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికయ్యారు.

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details