తెలంగాణ

telangana

ETV Bharat / state

యూనిసెఫ్​ ఇన్నోవేషన్​ ఛాలెంజ్​ప్రారంభం

యూనిసెఫ్​ స్కూల్​ ఇన్నోవేషన్​ ఛాలెంజ్​కు సంబంధించిన ఆన్​లైన్​ దరఖాస్తును ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్​ రంజన్​ హైదరాబాద్​లో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక గురుకుల పాఠశాలల్లోని 6 నుంచి పదో తరగతి విద్యార్థులు ఛాలెంజ్లో పాల్గొనవచ్చని జయేష్​ వివరించారు.

Unicef_Innovation_Challenge started by  jayesh ranjan
యూనిసెఫ్​ ఇన్నోవేషన్​ ఛాలెంజ్​ను ప్రారంభించిన జయేష్​ రంజన్

By

Published : Sep 9, 2020, 9:55 PM IST

యూనిసెఫ్​ స్కూల్​ ఇన్నోవేషన్​ ఛాలెంజ్​ ప్రక్రియను ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్​ రంజన్​ హైదరాబాద్​లో ప్రారంభించారు. యూనిసెఫ్​- టీఎస్​ఐసీ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ సహకారంతో నిర్వహించనున్న ఈ ఛాలెంజ్​కు సంబంధించిన ఆన్​లైన్​ దరఖాస్తును జయేష్​ రంజన్ ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, సాంఘిక గురుకుల పాఠశాలల్లోని 6 నుంచి పదో తరగతి విద్యార్థులు ఛాలెంజ్లో పాల్గొనవచ్చని జయేష్​ వివరించారు.

పిల్లల్లో ఆవిష్కరణ, సమస్య-పరిష్కార నైపుణ్య స్ఫూర్తిని రగిలించేందుకు ఈ ఇన్నోవేషన్​ ఛాలెంజ్ ఎంతగానో దోహదపడుతుందని జయేష్​ రంజన్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ఈ ఛాలెంజ్​లో చురుగ్గా పాల్గొనేందుకు జిల్లా విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకుని.. వారికి అవగాహన కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి:ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్‌ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details