తెలంగాణ ఫుడ్ ఆధ్వర్యంలో అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేసే బాలామృతాన్ని ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 800ల మెట్రిక్ టన్నుల బాలామృతాన్ని సరఫరా చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి రోజూ సుమారు 15 కార్గో బస్సుల్లో వీటిని సరఫరా చేస్తున్నామన్నారు.
ఆర్టీసీలో ప్రారంభమైన కార్గో సర్వీసులు - ఆర్టీసీలో ప్రారంభమైన కార్గో సర్వీసులు...
తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసులను ప్రారంభించింది. సంస్థ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇవి అందుబాటులోకి వచ్చాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో అంగన్‌వాడీ సెంటర్లకు ఈ సర్వీసుల ద్వారా సరుకులు రవాణా చేస్తున్నారు.
ఆర్టీసీలో ప్రారంభమైన కార్గో సర్వీసులు
తమ వద్ద నిత్యం 220 నుంచి 230 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని వాటిని రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉండే అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నమన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో లారీలకు బదులు ఆర్టీసీ కార్గో బస్సులను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి అంగన్ వాడీ కేంద్రాలకు చిన్న వాహనాల ద్వారా సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:ఎన్నికల కమిషనర్ల జీతాల్లో 30 శాతం కోత