ఆర్టీసీ ఐకాస నిరవధిక దీక్షలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఎల్బీనగర్ రెడ్డికాలనీలో ఐకాస కోకన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయమే ఆయన ఇంటికి అటు పోలీసులు, కార్మికులు భారీ ఎత్తున చేరుకున్నారు.
ఆర్టీసీ ఐకాస కో కన్వీనర్ అరెస్ట్
ఇటు కార్మికుల నిరసనలు.. అటు పోలీసుల అడ్డంకుల మధ్య ఆర్టీసీ ఐకాస నిరవధిక దీక్షలు ఉద్రిక్తంగా మారాయి. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తే.. కో కన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేసి ఎల్బీ నగర్ పీఎస్కు తరలించారు.
ఆర్టీసీ కో కన్వీనర్ రాజిరెడ్డి అరెస్ట్... ఎల్బీ నగర్ పీఎస్కు తరలింపు
నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవంతంగా కార్మికులను అరెస్ట్ చేశారు. రాజిరెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ సమయంలో ఇద్దరు మహిళ కార్మికుల చేతులకు స్వల్ప గాయాలయ్యాయి.
ఇవీ చూడండి : 'మమ్మల్ని అరెస్టు చేసినా... మా దీక్ష కొనసాగుతుంది'
Last Updated : Nov 16, 2019, 12:16 PM IST