ఆర్టీసీ జేఏసీ నేడు నిరవధిక దీక్షకు పిలుపునిచ్చినందున అర్ధరాత్రి నుంచి పలువురు జేఏసీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్లు చేశారు. అర్ధరాత్రి తన ఇంటికి పోలీసులు వచ్చి తలుపులు తెరవాలంటూ దౌర్జన్యం చేశారని జేఏసీ కన్వినర్ అశ్వత్థామ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అశ్వత్థామ రెడ్డి ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. మరో వైపు నిరాహార దీక్షకు ఇందిరా పార్క్ వద్ద పోలీసులు అనుమతి ఇవ్వనందున టీఎస్ఆర్టీసీ ఈయూ కార్యాలయం వద్ద దీక్ష చేపడతామని కో కన్వీనర్ రాజిరెడ్డి వెల్లడించారు. తమ నేతలను అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు.
'మమ్మల్ని అరెస్టు చేసినా... మా దీక్ష కొనసాగుతుంది' - ashwathama reddys house is in vanasthalipuram
హైదరాబాద్లో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించారు. జేఏసీ నిరవధిక దీక్షకు పిలుపునిచ్చినందున పోలీసులు ముందస్తు అరెస్టులు చేపడుతున్నారు.