మహమ్మారి భయంతో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా వెంకటగిరి, బొగ్గులమిట్టకు చెందిన గిరిజనులు వెలిగొండ అటవీ ప్రాంతంలోని కోన మల్లేశ్వరస్వామి కోనకు తరలివెళ్లారు. వీరిలో 10 కుటుంబాలకు చెందిన పెద్దలు, చిన్నారులు, మహిళలు, వృద్ధులు కలిపి.. 70 మంది దాకా ఉన్నారు. సమాచారం అందుకున్న నెల్లూరు కోర్టుకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.జె. ప్రకృతికుమార్ బుధవారం కోనకు వెళ్లి గిరిజనులతో మాట్లాడారు.
కరోనా భయంతో.. అడవిలోకి గిరిజనులు! - tribals went in to forest in fear of corona
కొవిడ్ భయంతో ఏపీలోని నెల్లూరు జిల్లా వెంకటగిరి, బొగ్గులమిట్టల్లోని గిరిజనులు అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న నెల్లూరు కోర్టుకు చెందిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారితో మాట్లాడి.. ఇళ్లకు తిరిగి వచ్చేందుకు ఒప్పించారు.
తామంతా కరోనా భయంతో ఊరు వదిలి అడవికి వచ్చేశామని వారు ఆయనకు తెలిపారు. నాలుగు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు తీసుకువచ్చామని, తీరా అవి రెండు రోజులకే అయిపోయాయని తెలిపారు. ఏపీపీ మాట్లాడుతూ ధైర్యంగా ఇళ్లలోనే ఉండాలని, ఇలా అడవికి రావడం ప్రమాదకరమని వివరించారు. ఇళ్లకు వెళ్తే తామే నిత్యావసర సరకులను అందిస్తానని హామీ ఇచ్చారు. వాహన సౌకర్యం కూడా కల్పిస్తామనడంతో.. గిరిజనులు ఇళ్లకు వెళ్లేందుకు అంగీకరించారు.
ఇవీ చదవండి:కరోనాకు చిక్కొద్దని వ్యవసాయ క్షేత్రాల్లోకి మకాం మారుస్తున్న ధనవంతులు