తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Feb 15, 2021, 8:50 PM IST

top ten news for 9pm
టాప్​టెన్​ న్యూస్​@9PM

సుప్రీం కమిటీ భేటీ

సాగు చట్టాలపై నెలకొన్న వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మరోసారి భేటీ అయింది. ఏడుగురు ప్రముఖ విద్యావేత్తలు, నిపుణులతో చర్చలు జరిపింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

త్వరలో 19 టీకాలు!

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ కీలక ప్రకటన చేశారు. త్వరలో మరిన్ని సంస్థలు కొవిడ్​ టీకాలను అందుబాటులోకి తెస్తున్నాయని పేర్కొన్నారు. 50 ఏళ్లు పైడిన వారికి కూడా త్వరలో టీకా పంపిణీ ప్రారంభిస్తామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఎదురుచూస్తున్నా..

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కలిసి చర్చాగోష్ఠిలో పాల్గొనేందుకు... చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫిబ్రవరి 22,23 తేదీల్లో వర్చువల్​ విధానంలో బయో ఆసియా సదస్సు జరగనుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

గడువు పెంపు

రాష్ట్రంలో బోధన రుసుములు, ఉపకారవేతనాల దరఖాస్తు గడువు నేటితో ముగుస్తున్నందున.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ-పాస్ ద్వారా దరఖాస్తు చేసుకొనేందుకు మార్చి 31 వరకు అవకాశం కల్పించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కాల్వలోకి దూసుకెళ్లిన కారు

వరంగల్‌ జిల్లాలో కారు కాల్వలో పడిన ఘటన మరువకముందే... అలాంటి ఘటనే జగిత్యాల జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. మేడిపల్లి కంట్లకుంట వద్ద ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. జగిత్యాల నుంచి జోగినపల్లి వెళ్తుండగా... ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

జనసంద్రంగా నాగోబా

నాగోబా జాతర ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్​ ఛైర్మన్​ ఎర్రోల్ల శ్రీనివాస్​ దేవతను దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

టీవీ ఉంటే రేషన్​ కార్డ్ కట్

'టీవీ ఉంటే రేషన్​కార్డు కట్​' అని కర్ణాటకవ్యాప్తంగా కలకలం రేపిన వార్తలు అవాస్తవమని తేలింది. ఈ విషయమై స్పష్టత నిచ్చిన యడియూరప్ప సర్కార్​.. ప్రస్తుతం ఉన్న బీపీఎల్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని తేల్చిచెప్పింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

బుల్​ విజృంభణ

స్టాక్ మార్కెట్లలో మరోసారి బుల్​ విజృంభించింది. సెన్సెక్స్​ 610 పాయింట్ల లాభంతో సరికొత్త రికార్డు స్థాయి అయిన 52,150పైకి చేరింది. నిఫ్టీ 150 పాయింట్లకుపైగా లాభంతో తొలిసారి 15,300 మార్క్​పైన స్థిరపడింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

భారత్​ ఆధిపత్యం

టీమ్​ఇండియాతో జరుగుతోన్న రెండో టెస్టులో మూడో రోజు ఆటముగిసేసరికి ఇంగ్లాండ్ 53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో డేనియల్​ లారెన్స్​(19), జో రూట్​(2) ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్(2), అశ్విన్​ ఓ వికెట్​ను దక్కించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

షారుక్-ఆలియా కాంబో

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్​ బ్యానర్​లో ఆలియా భట్ ఓ సినిమా చేయనుందట. 'డార్లింగ్స్'​ టైటిల్​తో తెరకెక్కబోయే ఈ చిత్రం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details