తెలంగాణ

telangana

By

Published : May 11, 2020, 1:03 PM IST

ETV Bharat / state

టాప్​ టెన్​​ న్యూస్​ @ 1PM

.

top ten news @1pm
టాప్​ టెన్​​ న్యూస్​ @ 1 pm

  • ఈఎస్​ఐ వైద్యులకు సన్మానం

భారత్‌ పాటిస్తున్న సంప్రదాయాలే మనకు రక్షణగా నిలుస్తున్నాయని గవర్నర్‌ డా.తమిళిసై సౌందరరాజన్‌ అభిప్రాయపడ్డారు. సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని గవర్నర్‌ సందర్శించారు. వైరస్​ నివారణలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యుల సేవలను కొనియాడారు. మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన బృందానికి అభినందనలు తెలిపారు.

  • ప్రధానికి సీఎం కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..?

దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా మరింత కాలం లాక్‌డౌన్‌ కొనసాగించాలనే అభిప్రాయంతో సీఎం కేసీఆర్​ ఉన్నట్లు తెలిసింది. నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నిర్వహించే దృశ్యమాధ్యమ సమీక్షలో సీఎం కేసీఆర్‌ పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం.

  • ఆగస్టు వరకూ ఆగాల్సిందే..!

కరోనా మహమ్మారి శుభకార్యాలనూ సైతం వదల్లేదు. లాక్‌డౌన్‌ దెబ్బకు ఏప్రిల్‌లో జరగాల్సిన వివాహాలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో పెళ్లి కోసం అప్పులు చేసిన వారు వడ్డీ కట్టలేక ఇబ్బంది పడుతుండగా... ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనుకునే వారు వేడుకను వాయిదా వేసుకున్నారు.

  • ఇంటర్‌ పరీక్షలకు హాజరుపై విద్యార్థుల ఆందోళన

లాక్​డౌన్​ కారణంగా తెలంగాణలో నిలిచిన ఇంటర్​ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. హైదరాబాద్​లో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు... పరీక్షల వాయిదా సమయంలో స్వగ్రామాలకు చేరుకున్నారు. తాజా ప్రకటనతో పరీక్షలకు ఎలా హాజరుకావాలో తెలియక సతమతమవుతున్నారు.

  • ఒకేరోజు 4,213 కేసులు

దేశంలో నిన్న రికార్డు స్థాయిలో 4,213 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 67,152కు చేరుకుంది. 24 గంటల్లో 97 మంది కరోనాతో మరణించారు.

  • మే 17 కంటే ముందే?

లాక్​డౌన్​ 3.0 ముగిసేలోగా విమాన సర్వీసులు నడిపేందుకు అవకాశాలను పౌర విమానయాన శాఖ పరిశీలిస్తోంది. గత మూడు రోజులుగా విమానయాన సంస్థలు, ఎయిర్ పోర్ట్ ఆపరేటర్లతో పౌర విమానయాన శాఖ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి చర్చలు జరిపారు. నేడు మరోసారి విమానయాన సంస్థలతో అధికారులు చర్చలు జరపనున్నారు.

  • నిలకడగా మన్మోహన్​ సింగ్​ ఆరోగ్యం.. కానీ!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని దిల్లీ ఎయిమ్స్‌ వర్గాలు వెల్లడించాయి. కొత్త మందులు రియాక్షన్ ఇవ్వడం, జ్వరం రావడానికి కారణాలను తెలుసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

  • 81 ఏళ్ల నాటి ఫొటో ఇప్పుడు వైరల్​- కారణం?

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కబళిస్తుంటే... 1939లో ఐరోపా దేశాలను ఇన్​ఫ్లూయెంజా అతలాకుతలం చేసింది. ఈ అంటువ్యాధి వ్యాపించకుండా అప్పట్లోనే ప్రజలు భౌతిక దూరం పాటించారు. ఆ సమయంలోనే ఓ జంట వినూత్నంగా ఆలోచించి... తమ బుజ్జాయిని ఎవరూ తాకకుండా ఉండడానికి 'దయ చేసి నన్ను ముద్దాడొద్దు' అనే ఓ బ్యాడ్జిని చిన్నారి దుస్తులకు తగిలించింది.

  • ఉద్దీపనలపై ఆశలతో స్టాక్​ మార్కెట్లలో జోష్​

స్టాక్​మార్కెట్లు మంచి లాభాల్లో కొనసాగుతున్నాయి. ఔషధ, ఎఫ్ఎమ్​సీజీ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​తో నేడు జరగాల్సిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఈఓల భేటీ వాయిదా పడింది.

  • దిల్​రాజు రెండో పెళ్లి.. ఫొటోలు వైరల్

ప్రముఖ నిర్మాత దిల్​రాజు రెండో వివాహం చేసుకున్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

ABOUT THE AUTHOR

...view details