తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్ ​@9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు...

By

Published : Apr 29, 2021, 8:58 PM IST

టాప్​టెన్​ న్యూస్ ​@9PM
టాప్​టెన్​ న్యూస్ ​@9PM

1. మినీ పోల్స్​కు సర్వం సిద్ధం

రాష్ట్రంలో మినీ పురపోరుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు కార్పొరేషన్లు, ఐదు పురపాలికల్లో శుక్రవారం పోలింగ్ జరగనుంది. సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు సిబ్బందికి ఫేస్ షీల్డ్‌లు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ప్రాణాలా...? ఎన్నికలా...?

కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్రంలో పుర, నగర పాలక ఎన్నికలు నిర్వహణపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలు, అధికారుల ప్రాణాలను పణంగా పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికలు నిర్వహిస్తోందని ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఎస్ఈసీ అధికారులు భూమిపైనే ఉన్నారా? లేక అంగారక గ్రహంపైనా ఉన్నారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మూడున్న కోట్ల టీకాలు కావాలి...

18-44 ఏళ్ల మధ్య వారికి 3.5 కోట్ల టీకాలు కావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల వెల్లడించారు. రాష్ట్రానికి రోజుకు 10 లక్షల టీకాలిచ్చే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. టీకాలు వచ్చే పరిస్థితిని బట్టి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. 3.5 కోట్ల టీకాలు 3 నెలల్లో ఇవ్వాలని అనుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో లాక్​డౌన్​ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. పట్టపగలే కాల్పులు.. దోపిడి...

హైదరాబాద్‌లో పట్టపగలే దర్జాగా ఏటీఎంలో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. డబ్బులు నింపుతున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెక్యూరిటీ గార్డు మృతి చెందాడు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో వేట ముమ్మరం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఆసక్తికరంగా ఎగ్జిట్​పోల్స్​...

దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి గత నెల రోజులకుపైగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్​పోల్స్​ ఫలితాలు వెలువడ్డాయి. బంగాల్​, తమిళనాడు, కేరళ, అసోంలతో పాటు పుదుచ్చేరికి ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీలతో పాటు చిన్న పార్టీలు సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న క్రమంలో ఎగ్జిట్​ పోల్స్​కు ప్రాధాన్యం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. హోం ఐసోలేషన్ కొత్త గైడ్​లైన్స్​...

మధ్యస్థాయి లేదా కరోనా లక్షణాలు లేని వారికి సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. తాజాగా వాటిలో స్వల్ప మార్పులు చేసింది. అవి మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అంతరిక్షంలో ఆకుకూరలు...

నాసా వ్యోమగామి మైఖెల్ హాప్​కిన్స్ అంతరిక్షంలో రెండు పంటలను పండించారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆయన.. అమారా, పాక్ చోయి అనే ఆకు కూరల మొక్కలను పెంచారు. వీటిని అక్కడి వ్యోమగాములు ఇష్టంగా తిన్నారని ఆయన తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.


8. కొవాగ్జిన్​ ధర తగ్గిందోచ్​...

కరోనా వ్యాక్సిన్‌ ధరను తగ్గిస్తూ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆ సంస్థ తయారు చేస్తున్న కొవాగ్జిన్‌ను రూ.400లకే రాష్ట్ర ప్రభుత్వాలకు అందించనున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600లకు కొవాగ్జిన్‌ అందిస్తామని ప్రతిపాదించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. రాజస్థాన్​రాయల్స్​ ఉదారత...

ఐపీఎల్​ ఫ్రాంఛైజీ రాజస్థాన్​ రాయల్స్​.. తమ ఉదారతను చాటుకుంది. దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తున్న వేళ వైరస్​ బాధితులకు అండగా నిలిచేందుకు రూ.7.5 కోట్లను విరాళంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. యూట్యూబ్​లో బాలయ్య గర్జన...

బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న చిత్రం 'అఖండ'. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ రోర్ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్​లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి దూసుకెళ్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details