నేడు ఈసెట్‌తో రాష్ట్రంలో ప్రవేశ పరీక్షలు మొదలు కానున్నాయి. పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే.. ఈసెట్ కోసం జేఎన్టీయూహెచ్ సర్వం సిద్ధం చేసింది. కరోనా పరిస్థితులతో పలు మార్లు వాయిదా పడిన ఈసెట్... ఇవాళ ఆన్‌లైన్ విధానంలో రెండు పూటలు జరగనుంది.
నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష
కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్రంలో వాయిదా పడిన పరీక్షలను ఒక్కొక్కటిగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమో, బీఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తారు.
నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు... మద్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష జరగనుంది. ఈసెట్ కోసం తెలంగాణలో 52, ఏపీలో 4 కేంద్రాలను సిద్ధం చేశారు. మొత్తం 28 వేల 15 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి పరీక్ష కేంద్రాల్లోకి మంచినీటి బాటిల్, శానిటైజర్, గ్లౌజులు, మాస్కును అనుమతించనున్నారు.
ఇదీ చూడండి:కేసీఆర్ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..?