తెలంగాణ

telangana

తొలిసారిగా అరటి పండ్లను రవాణా చేసిన దక్షిణ మధ్య రైల్వే

By

Published : Jan 24, 2021, 5:14 AM IST

తొలిసారిగా అరటి పండ్లను రైల్‌ రిఫ్రిజిరేటర్‌ కంటైనర్ల ద్వారా రవాణా చేశామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. గుంతకల్‌ డివిజన్‌లోని తాడిపత్రి నుంచి ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రు పోర్టు ట్రస్టుకు సరఫరా చేశామని తెలిపింది.

The South Central Railway was the first to transport bananas
తొలిసారిగా అరటి పండ్లను రవాణా చేసిన దక్షిణ మధ్య రైల్వే

గుంతకల్‌ డివిజన్‌లోని తాడిపత్రి నుంచి ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రు పోర్టు ట్రస్టుకు... తొలిసారిగా రైల్‌ ద్వారా 43 రీఫర్‌ కంటైనర్ల అరటి పండ్లను రవాణా చేశామని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఏపీలోని అనంతపూర్‌, కడప జిల్లాలో సాగయ్యే అరటి పండ్లకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నందున... మధ్య తూర్పు దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు.

సాధారణంగా అరటి పండ్లు రోడ్డు మార్గంలో రవాణా చేస్తారు. దీంతో రవాణాకు అధిక సమయం పట్టి దారి మధ్యలోనే భారీగా నష్టం జరిగేది. ఈ సమస్యను అధిగమిస్తూ రైతుకు సహాయపడేందుకు దక్షిణ మధ్య రైల్వే రీఫర్‌ కంటైనర్లతో నిరాటంకంగా రవాణా చేయాలని నిర్ణయించుకుంది. మధ్య తూర్పు దేశాలకు ఎగుమతి కోసం సుమారు 977 టన్నుల అరటి పండ్లతో ఉన్న 43 రిఫ్రిజిరేటర్‌ కంటైనర్లతో కూడిన మొదటి రీఫర్‌ కంటైనర్​ను ఈ నెల 22న తాడిపత్రి నుంచి జేఎన్‌పీటీ, ముంబయికి పంపించారు.

ఇదీ చదవండి:కేటీఆర్ సీఎం అయితే మెడికల్ కాలేజీ మొదటికే

ABOUT THE AUTHOR

...view details