తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​తో పడిపోయిన బత్తాయి ధర - lock down effect on orange

లాక్​డౌన్ ఆంక్షల నేపథ్యంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం వల్ల పండ్ల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. వేలాది రూపాయలు పెట్టుబడిపెట్టి ఆరుగాలం శ్రమించి పండించిన పండ్లు మార్కెట్‌కు తెస్తే... కమీషన్ ఏజెంట్లు తక్కువ ధరకు అడగడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

The price of a fallen Orange  at gaddi annaram market in hyderabad
లాక్​డౌన్​తో ధర పడిపోయిన బత్తాయి

By

Published : Apr 3, 2020, 4:04 AM IST

కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడం వల్ల హైదరాబాద్‌ గడ్డిఅన్నారం మార్కెట్‌లో బత్తాయి కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదు. నాణ్యత ఆధారంగా బత్తాయి టన్ను కనిష్ఠ ధర 10 నుంచి గరిష్ఠ ధర 23 వేల రూపాయలకు మించి కొనడం లేదు.

కనీసం పెట్టిన పెట్టుబడి చేతికి రావడం లేదంటూ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది ఏప్రిల్‌ 2న ఇదే రోజు బత్తాయి టన్ను ధర 40 నుంచి 45 వేల రూపాయలు పలికింది. మరోవైపు నగరం నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడం వల్ల తాము సరకు కొనలేకపోతున్నామని కమీషన్ ఏజెంట్లు చెబుతున్నారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో పరిస్థితిపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు.

లాక్​డౌన్​తో ధర పడిపోయిన బత్తాయి

ఇవీ చూడండి: కరోనాపై పోరులో ప్రజలకు రేపు మోదీ వీడియో సందేశం

ABOUT THE AUTHOR

...view details