ఆరు సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపని.. తెరాస ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఎన్నికల ప్రచారం లాంఛనంగా ప్రారంభించారు. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్లో ఇప్పటివరకు రాక్షస పాలన జరిగిందని.. భాజపా అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసి ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
"అవినీతి అంతం.. భాజపా పంతం" - Municipal campaign started BJP President Laxman in Nizampeta Municipality
హైదరాబాద్‌లోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పుర ఎన్నికల ప్రచారాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ లాంఛనంగా ప్రారంభించారు. నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లిలో ఇప్పటివరకు రాక్షస పాలన కొనసాగిందని విమర్శించారు.
తెరాసకు ఓటేస్తే ఎంఐఎంకు వేసినట్లే...
"భాజపాని గెలిపిస్తే ప్రజాసేవకులుగా ఉంటారు.. తెరాస గెలిస్తే ఫామ్ హౌస్‌కు బానిసలవుతారు"
ఇవీ చూడండి: బస్తీమే సవాల్: జగిత్యాల పీఠం హస్తగతమా... గులాబీమయమా...?
Last Updated : Jan 13, 2020, 9:32 AM IST