తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ అమ్మాయి అసత్య ఆరోపణలు చేస్తోంది: వినయ్​వర్మ - women

అచిత్​కౌర్​ చందా అనే యువతి చేసిన ఆరోపణపై నటశిక్షణ నిర్వాహకుడు వినయ్​వర్మ స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపాడు. దీనిపై న్యాయస్థానంలో పోరాడుతానని స్పష్టం చేశారు.

ఆ అమ్మాయి అసత్య ఆరోపణలు చేస్తోంది: వినయ్​వర్మ

By

Published : Apr 17, 2019, 6:47 PM IST

గత ఇరవై ఏళ్లుగా హిమాయత్​ నగర్​లో నటనపై శిక్షణ ఇస్తున్నానని నటశిక్షణ నిర్వహకుడు వినయ్​ వర్మ తెలిపారు. జాతీయ స్థాయి వేదికల్లో ప్రదర్శనలు కూడా చేశానని.. ట్రైనింగ్​లో పైదుస్తులు తొలగించడం సహజమైన ప్రక్రియని పేర్కొన్నారు. ఇప్పటివరకు అనేక మంది నటులకు శిక్షణ ఇచ్చానని స్పష్టం చేశారు. అచిత్​ కౌర్​ చందా అనే యువతి శిక్షణపై ఇష్టం లేకపోవడం వల్లనే తనపై అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని వినయ్ వర్మ తెలిపాడు.

ఆ అమ్మాయి అసత్య ఆరోపణలు చేస్తోంది: వినయ్​వర్మ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details