తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ డాక్టరు దగ్గరికెళితే రహస్య ప్రదేశాల్లో తడుముతున్నాడు' - The arrest of the doctor for behaving indecently towards a woman patient

వైద్యోనారాయణ హరి అన్నారు పెద్దలు. వైద్యుడిని కనిపించని దేవుడిగా భావిస్తాం.. అంతటి విశిష్టత ఉన్న వైద్య వృత్తికే కలంకం తెచ్చాడో డాక్టరు. కడుపునొప్పి అంటూ వైద్యం కోసం వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి... కటకటాలపాలయ్యాడు.

Patient_Molested
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిచిన వైద్యుడు అరెస్ట్​

By

Published : Dec 20, 2019, 12:38 PM IST

వైద్యం కోసం వచ్చిన మహిళను రహస్య ప్రదేశాల్లో తాకడమే కాకుండా.. అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడు కటకటాల పాలైన ఘటన పాతబస్తీ చాంద్రాయణ గుట్ట ఠాణా పరిధిలోని బండ్లగూడలో జరిగింది. అహ్మద్​రాహి... బీఏఎంఎస్​ డాక్టర్​గా బండ్లగూడలో క్లినిక్​ నడిపిస్తున్నాడు. ఈనెల 16న అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ కడుపునొప్పితో బాధపడుతూ వైద్యం కోసం భర్తతో కలిసి అతని క్లినిక్​కు వచ్చింది. చెకప్​ చేస్తానంటూ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా... రహస్య ప్రదేశాల్లో తాకాడంటూ బాధిత మహిళ ఆరోపించింది. ఈ విషయమై తన భర్తతో కలిసి ఈనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వైద్యున్ని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details