కొవిడ్ కారణంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు సహజవాయువుపై వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతున్నట్టుప్రభుత్వం ప్రకటించింది. 14.5 శాతంగా ఉన్న పన్ను 24. 5 శాతానికి పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలకు భారీ ఎత్తున నిధులు కావాలని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవో స్పష్టం చేసింది.
రాష్ట్రంలో సహజవాయువుపై ఏపీ వ్యాట్ చట్టం ప్రకారం పన్ను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్ను పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఐదు రకాల పెట్రోలియం ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను వసూలు చేస్తోంది. ముడి చమురుపై 5 శాతం మేర, పెట్రోలుపై 31 శాతంతో పాటు అదనంగా 4 రూపాయల మేర పన్ను వసూలు చేస్తుంది. డీజిల్పై 22.5 శాతంతోపాటు అదనంగా 4 రూపాయల మేర వ్యాట్, ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై 1 శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తోంది.