తెలంగాణ

telangana

By

Published : Oct 9, 2021, 4:01 PM IST

ETV Bharat / state

Telugu Yuvatha: బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలకు నోటీసులు ఎందుకిచ్చారు?

తెలంగాణలో డ్రగ్స్ సరఫరా రోజురోజుకూ పెరిగిపోతోందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు జైరామ్ చందర్ తెలిపారు. మత్తు వ్యవహారంపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో రాష్ట్ర ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరు.. వారికెందుకు నోటీసులు ఇచ్చారనే విషయాన్ని బహిర్గతం చేయాలని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Telugu Yuvatha
Telugu Yuvatha

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. మత్తు పదార్థాల సరఫరాతో సంబంధమున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పొగాకు జైరామ్‌ చందర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు జైరామ్‌ చందర్ నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా సే నో టు డ్రగ్స్‌ అంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. బెంగళూరు డ్రగ్స్‌ కేసుకు సంబంధించి రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఎందుకు పంపారనే విషయాన్ని బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఎంఐఎం, భాజపా, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ వాడకంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని తెలుగు యువత అధ్యక్షుడు హెచ్చరించారు.

ఇదీ చదవండి:Ramoji film city: రామోజీ ఫిల్మ్​సిటీలో రంగుల వినోదాలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details