నైరుతి రుతుపవనాలు ఈ నెల 31న కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Weather report) ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోకి పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని తెలిపింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న(IMD) తెలిపారు.
Weather Report: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు... హైదరాబాద్‌లో ఎండలు - హైదరాబాద్‌లో ఎండలు
రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో వచ్చే 48 గంటల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది.
weather report
అక్కడక్కడ పిడుగులు పడే అవకాశముందని పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి నైరుతి, దక్షిణ జిల్లాల్లో వర్షం ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లో(Hyderabad) రాగల 48 గంటల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఇదీ చూడండి:Vote For Note Case: తెలంగాణ అ.ని.శా.కు సుప్రీం నోటీసులు