తెలంగాణ

telangana

ETV Bharat / state

TOP TEN NEWS: టాప్​టెన్​ న్యూస్​ @3PM - తెలంగాణ టాప్​టెన్​ న్యూస్ లేటెస్ట్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
TOP TEN NEWS

By

Published : Feb 23, 2022, 3:36 PM IST

  • మల్లన్నసాగర్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్

కాసేపట్లో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేయనున్నారు.

  • కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు

2024లో భాజపా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌ చుగ్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భాజపా నేతలతో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిలో మాత్రమే తెరాస ముందుందని ఆరోపించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఈటల రాజేందర్, డీకే అరుణ, మనోహర్‌ పాల్గొన్నారు.

  • ఈడీ విచారణకు నవాబ్​ మాలిక్

ముంబయి అండర్‌వరల్డ్‌ వ్యవహారాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్‌ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదుచేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు మహా వికాస్​ అఘాడీ నేతలు.

  • బడ్జెట్​లో క్లియర్​ రోడ్​మ్యాప్

Union Budget 2022-23: దేశంలో మౌలిక వసతుల పథకాల లక్ష్యాన్ని 100 శాతం సాధించేందుకు సమయం ఆసన్నమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందుకు వార్షిక బడ్జెట్​ 2022-23లో కేంద్రం స్పష్టమైన మార్గనిర్దేశం చేసినట్లు చెప్పారు.

  • శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు.. ఇవే!

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం దేవస్థానానికి 155 బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. ఈనెల 27 నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని చెప్పారు.

  • విమానాశ్రయంలో బంగారం పట్టివేత

Gold seized in Shamshabad: హైదరాబాద్​ శివారులోని శంషాబాద్​ విమానాశ్రయంలో రూ.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంఫాల్​ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద పసిడిని గుర్తించిన అధికారులు.. సీజ్​ చేశారు.

  • కోడలిపై కన్నేసిన మామ.. కాదన్నందుకు

తండ్రి తర్వాత తండ్రిలా కోడలికి భరోసా ఇవ్వాల్సిన మామ.. మానవత్వాన్ని మరిచాడు. కుమారుడు చనిపోతే అతని భార్యను కూతురిలా ఆదరించాల్సిన మామ.. ఆమెపై పశువాంఛతో రగిలిపోయి వశపరుచుకోవాలని చూశాడు. అందుకోసం ప్రణాళికలు వేశాడు. పిల్లలున్నారని కూడా ఆలోచించకుండా.. మంచివాడిలా నటించి.. అదును చూసి మనసులోని నీచ ఆలోచనను బయటపెడ్డాడు. అది విని షాకయిన కోడలు.. వద్దని వారించింది.. బతిమిలాడింది.. ఫిర్యాదులు చేసింది. దీంతో తన మాటకు ఎదురుతిరిగేసరికి చివరికి కోడలిని చంపాలని చూశాడు ఆ కీచకుడు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది.

  • బంగారం ధరలకు రెక్కలు

Gold price today in India: బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధర భారీగా పెరుగుతోంది. మంగళవారం 50,518గా ఉన్న పది గ్రాముల పసిడి.. రూ.652‬ మేర ఎగబాకింది. ప్రస్తుతం రూ.51,170 పలుకుతోంది.

  • దిల్లీ క్యాపిటల్స్​ కోచ్​లు వీరే!

IPL 2022: ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​ అసిస్టెంట్​ కోచ్​గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ షేన్​ వాట్సన్​ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు టీమ్​ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్​ కూడా ఆ జట్టు కోచింగ్​ విభాగంలో చేరనున్నట్లు సమాచారం.

  • 'స్పిరిట్'​ కన్నా ముందే ​ 'రాజా డీలక్స్'​​!

Prabhas Maruti movie: సందీప్​ వంగా దర్శకత్వంలో ప్రభాస్​ నటించనున్న 'స్పిరిట్'​ చిత్రం కన్నా మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోయే 'రాజా డీలక్స్'​ను సెట్స్​పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం ప్లాన్​ చేస్తోందట! ఈ నేపథ్యంలో 'రాజాడీలక్స్'​ కోసం అత్యంత భారీ స్థాయిలో సెట్​ను నిర్మిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఓ జపనీస్​ సినిమా కథ స్ఫూర్తితోనే 'ఆదిపురుష్'​ను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు ఓంరౌత్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details