ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలుప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ PRC arrears to Telangana Government employees: తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లింపునకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 మే నుంచి 18 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలను చెల్లించనుంది.ఛార్జింగ్ పెడుతుండగా చెలరేగిన మంటలుElectric Bus Fire in Secundrabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం అయింది. ఎలక్ట్రిక్ బస్సుకు ఛార్జింగ్ పెడుతుండగా మంటలు చెలరేగాయి. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి ఎలక్ట్రిక్ బస్సు దగ్ధమైంది. వెంటనే ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను ఆర్పివేశారు. ప్రధానోపాధ్యాయుడి పైశాచికత్వం HM Harassed Students: ఆయన ఓ స్కూల్‌కు హెడ్ మాస్టర్. ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నా.. గుణగణాల్లో మాత్రం కీచకుడిని మించిపోయాడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది పోయి.. పాఠశాలలో చేయకూడని పనులు చేస్తూ.. వారితో చేయిస్తూ నీచానికి దిగజారారు.ఇది బానిసత్వపు తెలంగాణYS Sharmila Comments on KCR: మద్యం తాగించకపోతే రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఉందని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఇది బంగారు తెలంగాణ కాదు.. బానిసత్వపు తెలంగాణ అని ఆరోపించారు. ప్రియుడిని చితకబాదిన యువతి Viral video: తనను పెళ్లి చేసుకోవాలని.. ఓ యువతి ప్రేమికుడిని రోకలితో చితకబాదిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుంటానని మొహం చాటేశాడని ఆగ్రహానికి గురైన యువతి.. ప్రియుడిని తాళి కట్టాలని డిమాండ్ చేస్తూ చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.గుండె సమస్య లక్షణాలుHeart Attack Symptoms: గుండె జబ్బుల్లో చాలా వరకు.. జీవనశైలికి సంబంధించినవే. మన ఆహారపు అలవాట్లు, తగిన శారీరక శ్రమ లేకనే వీటి బారినపడే ప్రమాదం పెరుగుతోంది. గుండె సమస్యలు, ఆ కారణంగా చోటు చేసుకునే హఠాన్మరణాల ప్రతిసారి నిపుణులు, వైద్యులు చెప్పే మాట ఇదే.'స్థానిక' పోరులో డీఎంకే జోరు.. TN Local Body election results: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే దూసుకెళ్తోంది. ఇప్పటికే 21 గానూ 19 కార్పొరేషన్లలో ఆధిక్యంలో ఉంది. సుమారు 109 మున్సిపాలిటీల్లో కూడా డీఎంకే అభ్యర్ధులు సత్తా చాటుతున్నారు.ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం ఎంట్రీRussia Ukraine news: ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్రహోదా గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకున్న రష్యా ఆయా ప్రాంతాలకు తమ బలగాలను పంపుతోంది. ఈ మేరకు యుద్ధట్యాంకులు, బలగాలు డొనెట్స్‌క్‌కు సమీపంలో ఉన్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. అయితే వాటిపై ఎలాంటి గుర్తులు లేవని పేర్కొంది. రష్యా చర్యలతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.రోహిత్‌కు అతిపెద్ద సవాలు Sunil Gavaskar on Rohit: టీమ్ఇండియాకు మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మ రానున్న రోజుల్లో పెద్ద సవాళ్లు ఎదుర్కొనే అవకాశముందని మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేసేలా చూసుకోవడం రోహిత్‌కు అతిపెద్ద సవాలుతో కూడున్న పని అని పేర్కొన్నాడు.పోటీ నుంచి తప్పుకొన్న 'గని'Varun Tej Ghani: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. వరుణ్‌తేజ్ నటించిన 'గని', జాన్ అబ్రహం నూతన చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.