ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలులాలూకు ఐదేళ్లు జైలు శిక్ష Lalu Prasad Yadav News: దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60లక్షలు జరిమానా విధించింది రాంచీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్..Delhi Girl Gangrape: దిల్లీలో ఘోరం జరిగింది. తొమ్మిది రోజుల క్రితం కిడ్నాప్ అయిన బాలిక.. శవమై కనిపించింది. నిందితులు బాలికపై అత్యాచారం చేసి, కిరాతకంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. ఒకరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.కేటీఆర్ దిగ్భ్రాంతి KTR express deep Condolences : ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై తెలంగాణ మంత్రులు, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనస్తాపంతో రైతు ఆత్మహత్యFarmer suicide: నేల తల్లినే నమ్ముకున్న రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. అకాల వర్షం ఓ వైపు.. పంటకు తెగుళ్లు మరో వైపు.. వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. అప్పు చేసి పంట వేసి.. కాలం కలిసి రాక నష్టాలు ఎదుర్కొంటున్న అన్నదాతకు ఆత్మహత్యే శరణ్యంగా మిగిలింది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతన్న.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.తెలుగు భాషకు పట్టం.. Telugu in Madhya Pradesh schools: మధ్యప్రదేశ్ స్కూళ్లలో 'అ, ఆ, ఇ, ఈ'లు వినిపించనున్నాయి. తేనెలొలికే తెలుగు పదాలు అక్కడి విద్యార్థులు నోటి వెంట రానున్నాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్ణయంతో.. మధ్యప్రదేశ్ స్కూళ్లలో త్వరలో తెలుగు బోధించనున్నారు.నిన్నటి నుంచి చెట్టుకు వేలాడుతున్న మృతదేహంFarmer Suicide at Peddamallareddy village : కామారెడ్డి జిల్లా పెద్ద మల్లారెడ్డి గ్రామంలో... రైతు బలవన్మరణానికి పాల్పడ్డారు. భూ వివాదం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగేంతవరకు కిందకి దించబోమని పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి మృతదేహం చెట్టుకు వేలాడుతోంది.70 రకాల కొత్త పక్షుల గుర్తింపు New Birds in Pakala Sanctuary: ప్రతియేటా వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి పక్షులు పలు ప్రాంతాలకు వలస వెళ్లడం మనకు తెలిసిందే. అనుకూల వాతావరణం, తాగునీటి సౌకర్యాన్ని వెతుక్కుంటూ పక్షులన్నీ గుంపులుగా సుదూర ప్రాంతాలకు తరలివెళ్తాయి. అలా తెలంగాణకు కూడా వివిధ ప్రాంతాల నుంచి వలస వస్తుంటాయి. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలోని పాకాల అభయారణ్యంలో నిర్వహించిన సర్వేలో 70 కొత్త జాతులను గుర్తించారు.'డాక్టర్' కల సాకారం!Orphan Admission in MBBS College: పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చని నిరూపించింది మహారాష్ట్రకు చెందిన శభానా షేక్. అనాథ అయినప్పటికీ కష్టపడి చదివి ఎంబీబీఎస్ కాలేజీలో సీటు సాధించింది. డాక్టర్ కావాలనే తన కలను సాకారం చేసుకునే దిశగా తొలి విజయం సాధించింది. నాలుగేళ్లకే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె విజయగాథ..తొలి కెప్టెన్‌గా సరికొత్త రికార్డు! IND vs WI Rohith Sharma: టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీమ్‌ఇండియా తరఫున మూడు, అంతకన్నా ఎక్కువ సిరీస్‌లు వైట్‌వాష్ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో ఈ ఘనత సాధించాడు.ఘనంగా కాజల్ సీమంతంహీరోయిన్ కాజల్.. సీమంతం వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోస్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.