తెలంగాణ

telangana

ETV Bharat / state

పూర్తైన సచివాలయ భవనాల కూల్చివేత

తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తైంది. గతనెల ఏడో తేదీన ప్రారంభమైన కూల్చివేతలు సోమవారంతో పూర్తైయ్యాయి. మధ్యలో కోర్టు ఆదేశాలతో వారం రోజులు పనులు ఆపివేశారు.

telangana secretariat demolition today completed
నేటితో పూర్తైన సచివాలయ భవనాల కూల్చివేత

By

Published : Aug 10, 2020, 9:13 PM IST

Updated : Aug 11, 2020, 5:16 AM IST

సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ పూర్తైంది. గతంలోనే మిగతా బ్లాకులు, నిర్మాణాల ప్రక్రియ పూర్తి కాగా జే, ఎల్ బ్లాకుల కూల్చివేత కూడా పూర్తైంది. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలోని అన్ని భవనాలు నేలమట్టం అయ్యాయి. గత నెల ఏడో తేదీన కూల్చివేత ప్రారంభం కాగా... న్యాయస్థానం ఆదేశాలతో మధ్యలో వారం రోజుల పాటు ఆగిపోయింది. 25, 26 రోజుల్లోనే కూల్చివేత ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు చెప్తున్నారు.

తరలింపు కూడా

శిథిలాల తొలగింపు కూడా గతంలోనే ప్రారంభం కాగా... ఆ ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. శిథిలాల తరలింపు కూడా వారం, పది రోజుల్లో పూర్తవుతుందని అంటున్నారు. ఆ తర్వాత కొత్త సచివాలయ భవన నిర్మాణం కోసం మొత్తం నేలను చదును చేయనున్నారు. అటు టెండర్ల ప్రక్రియకు కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. భవనాల నమూనాలు ఇప్పటికే ఖరారు కాగా అంచనాల తయారీ, సంబంధిత ప్రక్రియ కొనసాగుతోంది. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి ఈ నెలలోనే టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు ఆర్​అండ్​బీ శాఖ కసరత్తు చేస్తోంది.

ఇదీ చూడండి :ముథోల్ సర్పంచ్​ నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదు

Last Updated : Aug 11, 2020, 5:16 AM IST

ABOUT THE AUTHOR

...view details