తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: ప్రపంచదేశాల పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానం - ktr updates

సౌదీలోని భారత రాయబార కార్యాలయం అక్కడి కంపెనీలతో పాటు సౌదీ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వంటి పారిశ్రామిక సంస్థలతో కలిపి ఈ పెట్టుబడి మీట్ (Meet) ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr) ప్రారంభ ఉపన్యాసం చేశారు.

ktr
ktr

By

Published : Jun 14, 2021, 7:57 PM IST

ప్రపంచ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు తెలంగాణ ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానమని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister Ktr) అన్నారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం తెలంగాణ ఇన్వెస్ట్​మెంట్ మీట్ పేరిట ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభ ఉపన్యాసం చేశారు. రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన పారిశ్రామిక, పెట్టుబడి స్నేహపూర్వక విధానాల వల్ల ప్రపంచంలోని పలు దేశాలు, అగ్రశ్రేణి సంస్థల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని.. రాష్ట్రంలో మరిన్ని రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని సౌదీ కంపెనీలకు మంత్రి కేటీఆర్ (Minister Ktr) ఆహ్వానం పలికారు.

మీట్ ఏర్పాటు...

సౌదీలోని భారత రాయబార కార్యాలయం అక్కడి కంపెనీలతో పాటు సౌదీ ఇండియా బిజినెస్ కౌన్సిల్ వంటి పారిశ్రామిక సంస్థలతో కలిపి ఈ పెట్టుబడి మీట్ ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపైనా... పరిశ్రమల శాఖతో పాటు వివిధ శాఖల అధికారులు సౌదీ పెట్టుబడిదారులకు సమగ్ర వివరాలు అందిస్తారు. ఈ సందర్భంగా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన టీఎస్-ఐసాస్ (TSIPASS)వంటి సింగిల్ విండో విధానం ద్వారా సుమారు 22 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తెలంగాణ ఆకర్షించిందని, తద్వారా 1.5 మిలియన్ల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించిందని కేటీఆర్ తెలిపారు.

వేగంగా విస్తరణ...

రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, రెనెవబుల్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో వేగంగా విస్తరిస్తోందని.. ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సౌదీ కంపెనీలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సౌదీ వంటి అరబ్ దేశాలతో భారతదేశానికి అవినాభావ సంబంధం ఉందని, దేశంలోని లక్షలాది మంది అరబ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.

వాణిజ్య సంబంధాలు బలోపేతం...

సౌదీతో తెలంగాణ రాష్ట్ర వ్యాపార వాణిజ్య సంబంధాలు బలోపేతం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సౌదీ రాయబారి అసఫ్ సయీద్​కు మంత్రి కేటీఆర్ (Minister Ktr) ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ దేశంలోనే నూతన రాష్ట్రం అయినప్పటికీ ఐదు సంవత్సరాలుగా అద్భుతమైన పారిశ్రామిక ప్రగతిని సాధిస్తోందని, దేశంలోనే అత్యుత్తమ స్థానంలో ఉందని ఈ సందర్భంగా భారత రాయబారి అశోక్ సయూద్ తెలిపారు.

సౌదీ కంపెనీలకు పరిచయం...

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సౌదీలో ఉన్న కంపెనీలకు తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలపైన ఒక బ్రిడ్జిగా పని చేయాలని గతంలో కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాము నిర్వహిస్తున్న తెలంగాణ ఇన్వెస్టిమెంట్ మీట్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, ప్రభుత్వ పాలసీలను సౌదీలోని కంపెనీలకు పరిచయం చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:Etela: హుజూరాబాద్​లో వంద శాతం పోటీ చేస్తా.. గెలుస్తా..

ABOUT THE AUTHOR

...view details