కరోనా బాధితుల చికిత్స కోసం రాష్ట్రవ్యాప్తంగా 11 ఆసుపత్రులలో 12 వేల పడకలను సిద్ధం చేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీటిలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, కింగ్ కోఠి హాస్పిటల్, ఎర్రగడ్డ ఛాతీ, ఆయుర్వేద ఆసుపత్రులు, బల్కంపేట లోని నేచర్ క్యూర్ వైద్యశాలలున్నట్లు ప్రకటించింది.
కొవిడ్-19 నియంత్రణకు సిద్ధం : రాష్ట్ర ఆరోగ్యశాఖ
కొవిడ్ - 19 మరింత విస్తరించినా... నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా నివారణ వ్యాప్తికి తగు జాగ్రత్త చర్యలను చేపడుతున్నట్లు వెల్లడించింది.
Telangana Logo
ఇవేకాకుండా రాంనగర్లోని హోమియోపతి, చార్మినార్లోని నిజామియా, నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రులతో పాటు... మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి, వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరిగితే చికిత్స కోసం టెస్టింగ్ కిట్లు, వైద్యసిబ్బందిని సమకూర్చేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోందని వెల్లడించింది.
ఇవీచూడండి:జూన్ 3 వరకు లాక్డౌన్ చేయాలని సర్వేలు చెప్తున్నాయి: కేసీఆర్