దేశవ్యాప్త ధాన్యం సేకరణలో తెలంగాణ హవా చాటుతోంది. దేశం మొత్తం మీద కొనుగోలు చేసిన ధాన్యంలో రాష్ట్ర వాటా 66 శాతంగా ఉన్నట్లు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ప్రకటించింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా... కేవలం తెలంగాణలో 30 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డీవీ ప్రసాద్ తెలిపారు. అంటే మొత్తం కొనుగోళ్లలో తెలంగాణ వాటా 66 శాతంగా ఉంది. భారీ నీటి పారుదల ప్రాజెక్టులు చేపట్టటం వల్ల దిగుబడి పెరగటమే దీనికి కారణమని ఆయన అన్నారు.
తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యం కొనుగోలు : ఎఫ్‌సీఐ - భారత ఆహార సంస్థ
తెలంగాణ రాష్ట్రం నుంచే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని భారత ఆహార సంస్థ ప్రకటించింది. ఎఫ్‌సీఐ కొనుగోలు చేసిన ధాన్యంలో తెలంగాణ వాటానే 66 శాతం ఉందని ఎఫ్‌సీఐ ఛైర్మన్ డీవీ ప్రసాద్ తెలిపారు. రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రకటించారు.
ఎఫ్‌సీఐ
తెలంగాణ తర్వాత 10 లక్షల మెట్రిక్ టన్నులతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇక్కడి నుంచి భారీగా బియ్యాన్ని ఎఫ్‌సీఐ తెలంగాణ శాఖ తరలించింది. 374 రైలు లోడ్ల ద్వారా మొత్తం 10.47 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటి వరకు తరలించింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబంగలకు కొన్ని నెలల క్రితం నుంచి ఈ బియ్యం చేరుతుండగా... ఇటీవల ఈ జాబితాలో ఝార్ఖండ్ చేరింది.
ఇవీ చూడండి: ఎరువుల కొరత రానివ్వొద్దు: మంత్రి నిరంజన్‌రెడ్డి