తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.10వేల ఆర్థికసాయం చేసిన ఉపసభాపతి - పదివేల ఆర్థికసాయం చేసిన ఉపసభాపతి

కష్టకాలంలో, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని తెలంగాణా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ఇటీవల సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో మరణించటం వల్ల ఆమె కుటుంబసభ్యులకు రూ.10వేల ఆర్థికసాయాన్ని అందజేశారు.

Telangana Deputy  Speaker Padmarao goud Helping poor families
పదివేల ఆర్థికసాయం చేసిన ఉపసభాపతి

By

Published : Apr 14, 2020, 6:39 PM IST

సికింద్రాబాద్​ సీతాఫల్​మండిలోని మేడిబావి ప్రాంతానికి చెందిన రాధ అనే మహిళ అనారోగ్యంతో ఇటీవల మరణించింది. ఆమెకు ముగ్గురు చిన్నారులు, ఓ కుమార్తె సంతానం. మహిళ మరణంతో వీరంతా నిరాశ్రయులుగా మారారు. ఆమె భర్త గతంలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న ఉప సభాపతి పద్మారావు గౌడ్ స్వయంగా ఆమె నివాసాన్ని సందర్శించి పిల్లలను ఓదార్చారు. వారిని గురుకుల పాఠశాలలో చదువుకొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రూ.10 వేల ఆర్థిక సాయాన్ని, నిత్యావసర సరకులను కుటుంబసభ్యులకు అందజేశారు.

ఇదీ చూడండి:మోదీ 'లాక్​డౌన్​ 2.0' స్పీచ్​ హైలైట్స్

ABOUT THE AUTHOR

...view details