తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 73,207 నమూనాలను పరీక్షించగా.. 338 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,58,054కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారితో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,873కి పెరిగింది.
TS CORONA CASES: 73,207 మందికి పరీక్షలు.. 338 మందికి పాజిటివ్ - corona cases update
రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 338 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. మహమ్మారి బారినపడి ఒకరు మరణించారు. ప్రస్తుతం 5,864 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
TS CORONA CASES: 73,207 మందికి పరీక్షలు.. 338 మందికి పాజిటివ్
రాష్ట్రంలో ప్రస్తుతం 5,864 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రికవరీ రేటు 98.48 శాతం కాగా.. మరణాల రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 84 కేసులు నమోదైనట్లు తెలిపింది.
ఇదీ చూడండి: TS SCHOOLS REOPEN: రాష్ట్రంలో రేపటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు