తెలంగాణ

telangana

ETV Bharat / state

LIVE UPDATES : ధరణిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ.. 'ధరణి' వల్ల భూముల అమ్మకం, కొనుగోలు సులభం ప్రశాంత్​రెడ్డి

assembly sessions
assembly sessions

By

Published : Feb 9, 2023, 10:07 AM IST

Updated : Feb 9, 2023, 7:13 PM IST

19:12 February 09

ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయి: వేముల

  • ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు ఉన్నాయి.
  • ధరణి సమస్యలు పరిష్కారమైతే రైతులు గుండెమీద చేయివేసుకొని తిరగొచ్చు.

17:12 February 09

ధరణి పాస్‌ బుక్‌ ఒక్కటి ఉంటే చాలు బ్యాంక్‌లోన్‌ సులభం: ప్రశాంత్​రెడ్డి

  • ఎవరైనా భూమి కొనాలంటే ధరణిలో నమోదైందా అని అడుగుతున్నారు
  • 'ధరణి' వల్ల భూముల అమ్మకం, కొనుగోలు సులభం అయ్యాయి
  • 'ధరణి' వల్ల ఏ రైతు కూడా ఇబ్బంది పడటం లేదు
  • నేను కూడా స్వయంగా భూమి అమ్మాను, కొన్నాను
  • అరగంటలో భూమి అమ్మకం, కొనుగోలు జరుగుతోంది
  • గతంలో భూమి అమ్మకం, కొనుగోలు చాలా కష్టతరంగా ఉండేది
  • ధరణితో రైతులు ఎవ్వరూ ఇబ్బంది పడట్లేదు
  • 'ధరణి' వల్ల బ్యాంకు రుణాలు సులభంగా మారాయి
  • మళ్లీ పాత పటేల్, పట్వారీ వ్యవస్థను కాంగ్రెస్‌ కోరుకుంటుందా?
  • ధరణి పాస్‌ బుక్‌ ఒక్కటి ఉంటే చాలు బ్యాంక్‌లోన్‌ సులభంగా వస్తుంది

16:16 February 09

ప్రతి గ్రామంలోని కిరాణ దుకాణాలు మద్యం షాపులుగా మారిపోయాయి: రఘునందన్‌

  • ప్రతి గ్రామంలోని కిరాణ దుకాణాలు మద్యం షాపులుగా మారిపోయాయి: రఘునందన్‌
  • ఆదాయం పెంచుకోడానికి మద్యం కాకుండా మరో మార్గం చూసుకోవాలి: రఘునందన్‌
  • దివ్వాంగుల కోసం క్యాంపు పెట్టి ఈవీలు ఉచితంగా ఇవ్వాలి: రఘునందన్‌
  • బడుగు బలహీన వర్గాలకు నిధులు సరిగ్గా ఖర్చు పెట్టడం లేదు: రఘునందన్‌
  • బీసీలకు బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి: రఘునందన్‌
  • బీసీలకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారో లెక్కలు చూపించాలి: రఘునందన్‌

14:08 February 09

ఫెడరేషన్ ఏర్పాటు చేశారు.. ఒక్క రూపాయి ఇవ్వలేదు: శ్రీధర్‌బాబు

  • బీసీ సంక్షేమానికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడుతామన్నారు: శ్రీధర్‌బాబు
  • రూ.20 వేల కోట్ల మేరకు సవరణ చేయాలని కోరుతున్నా: శ్రీధర్‌బాబు
  • ఫెడరేషన్ ఏర్పాటు చేశారు.. ఒక్క రూపాయి ఇవ్వలేదు: శ్రీధర్‌బాబు
  • ఫెడరేషన్ బలోపేతం కోసం నిధులు మంజూరు చేయాలి: శ్రీధర్‌బాబు
  • పోడు భూముల సమస్య త్వరగా పరిష్కారం కావాలి: శ్రీధర్‌బాబు
  • ఐటీడీఏను ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు: శ్రీధర్‌బాబు
  • ధరణి వల్ల చాలా సమస్యలు ఉన్నాయి: భట్టి
  • రాష్ట్ర ప్రజల సమస్య మెుత్తం భూమి కోసమే: భట్టి
  • ధరణి వల్ల కొంత మంది రైతులు భూములు కోల్పోయారు: భట్టి

14:06 February 09

ధరణి పోర్టల్‌పై శ్రీధర్‌ బాబు ఆరోపణలు ఖండించిన కేటీఆర్‌

  • శ్రీధర్‌బాబు ఆరోపణలు ఖండించిన కేటీఆర్‌
  • ధరణి పోర్టల్‌పై శ్రీధర్‌ బాబు ఆరోపణలు ఖండించిన కేటీఆర్‌
  • శ్రీధర్‌బాబు... మీరు చేస్తున్న ఆరోపణలు నిరూపించగలరా?: కేటీఆర్‌
  • సత్య దూరమైన మాటలు మాట్లాడవద్దు: కేటీఆర్‌
  • మీరు చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే క్షమాపణ చెబుతారా?: కేటీఆర్‌
  • ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సమంజసమా?: కేటీఆర్‌
  • ప్రగతి భవన్‌పై దాడులు చేయాలని అని రేవంత్‌రెడ్డి అన్నారు: కేటీఆర్‌
  • కాంగ్రెస్‌ పార్టీ వైఖరి మార్చుకోవాలి: కేటీఆర్‌
  • చిన్న లోపాలను పట్టుకుని బూతద్దంలో చూపిస్తున్నారు: కేటీఆర్‌
  • శ్రీధర్‌బాబు.. ఆధారాలు లేకుండా మాట్లాడడం మంచిది కాదు: కేటీఆర్‌

14:02 February 09

శ్రీధర్‌ బాబు నిర్మాణాత్మక సూచనలు చేయాలి : మంత్రి ప్రశాంత్​రెడ్డి

  • ధరణి వల్ల 24 లక్షల మంది రైతులు సంతోషంగా ఉన్నారు: ప్రశాంత్‌రెడ్డి
  • కాంగ్రెస్‌ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు: ప్రశాంత్‌రెడ్డి
  • రైతులు.. ధరణి పోర్టలు వల్ల చాలా అనందంగా ఉన్నారు: ప్రశాంత్‌రెడ్డి
  • శ్రీధర్‌ బాబు సూచన మంచిదే: మంత్రి ప్రశాంత్​రెడ్డి
  • శ్రీధర్‌ బాబు నిర్మాణాత్మక సూచనలు చేయాలి : మంత్రి ప్రశాంత్​రెడ్డి
  • మా సమయం తగ్గించుకుని.. వారికి కేటాయిస్తాం : మంత్రి ప్రశాంత్​రెడ్డి

14:00 February 09

ధరణి పోర్టల్‌ రైతులకు శాపంగా మారింది: శ్రీధర్‌బాబు

  • ధరణి వల్ల చాలా సమస్యలు ఉన్నాయి: శ్రీధర్‌బాబు
  • రాష్ట్ర ప్రజల సమస్య మెుత్తం భూమి కోసమే: శ్రీధర్‌బాబు
  • ధరణి వల్ల కొంత మంది రైతులు భూములు కోల్పోయారు: శ్రీధర్‌బాబు
  • ధరణిలో లోపాలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలి: శ్రీధర్‌బాబు
  • ధరణి పోర్టల్‌ రైతులకు శాపంగా మారింది: శ్రీధర్‌బాబు
  • ఒకే రోజు 12 డిమాండ్లపై చర్చిస్తే అన్ని అంశాలు ప్రస్తావనకు అవకాశం ఉండదు: శ్రీధర్‌బాబు
  • సమావేశాలను వారం, పది రోజుల పాటు పొడిగిస్తే బాగుంటుంది: శ్రీధర్‌బాబు
  • అసెంబ్లీ సమావేశాలు మరో పదిరోజులు పెంచాలి: శ్రీధర్‌బాబు
  • సభలో అందరికీ అవకాశం కల్పించాలి: శ్రీధర్‌బాబు
  • రాష్ట్రంలో దళితులకు కేసీఆర్‌ భరోసా ఇచ్చారు: ఎమ్మెల్యే రసమయి

12:07 February 09

వాయిదా తీర్మానం తిరస్కరణకు నిరసనగా కాంగ్రెస్‌ సభ్యుల వాకౌట్

  • అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
  • విద్యుత్ సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్‌
  • కాంగ్రెస్‌ ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించిన సభాపతి
  • వాయిదా తీర్మానం తిరస్కరణకు నిరసనగా కాంగ్రెస్‌ సభ్యుల వాకౌట్

11:10 February 09

గత పాలకులకు.. ప్రస్తుతం కేసీఆర్‌కు చాలా తేడా ఉంది: హరీశ్‌రావు

  • బడ్జెట్‌లో ఎక్కువ శాతం బడుగు, బలహీన వర్గాలకు కేటాయింపులు జరిగాయి: హరీశ్‌రావు
  • దేశానికి దిక్సూచిగా, మార్గదర్శిగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది: హరీశ్‌రావు
  • దేశంలో కేవలం 49 శాతం ప్రజలకే శుద్ధిజలం అందుతోంది: హరీశ్‌రావు
  • ప్రస్తుతం మిషన్ భగీరథతో చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి
  • గత పాలకులకు.. ప్రస్తుతం కేసీఆర్‌కు చాలా తేడా ఉంది
  • గతంలో కాంగ్రెస్‌, తెదేపా హయాంలో 20 ఏళ్లకు ఒక మెడికల్‌ కళాశాలను పెట్టారు
  • తెలంగాణ గొప్ప విజయం సాధించింది
  • పేద ప్రజలకు కార్పొరేట్‌ ఆస్పత్రి అందుబాటులోకి రాబోతోంది

10:53 February 09

కరెంటు కోతలపై మండలిలో చర్చ జరగాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

  • 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్టు సభలో అబద్ధాలు చెప్తున్నారు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
  • కనీసం 8, 9 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
  • రైతులు సబ్‌స్టేషన్‌ల ముందు ధర్నాలు చేస్తున్నారు: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
  • కరెంటు కోతలపై మండలిలో చర్చ జరగాలి: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

09:39 February 09

TG Budget Sessions Live Updates: బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో ప్రారంభమైన చర్చ

  • బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో ప్రారంభమైన చర్చ
  • మూడు రోజుల పాటు బడ్జెట్ పద్దులపై చర్చ
  • బడ్జెట్ పై మండలిలోనూ కొనసాగనుతున్న సాధారణ చర్చ
  • చర్చకు సమాధానం ఇవ్వనున్న మంత్రి హరీశ్‌రావు
Last Updated : Feb 9, 2023, 7:13 PM IST

ABOUT THE AUTHOR

...view details