రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరింది. కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందున ఆందోళనను మరింత తీవ్రం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపునకు సంఘీభావం తెలిపిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతోపాటు తెదేపా నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పలువురు కార్యకర్తలను జేబీఎస్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని లాలాగూడ పీఎస్కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్టు చేసి పోరాటాన్ని నీరుకార్చేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు కోదండరాం తెలిపారు.
కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్.. - tsrtc employees strike 15th day latest
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు జేబీఎస్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతోపాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జేబీఎస్ వద్ద తెజస, తెదేపా నేతల అరెస్ట్