అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలని కోరుతూ...గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డులో 26వ రోజున రైతులు ధర్నాలు కొనసాగించారు. రాజధాని మార్పును ఎవరూ అడ్డుకోలేరని వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. రాజధాని తరలింపు అంటూ జరిగితే తమ శవాల మీద నుంచే జరగాలని రైతులు తేల్చిచెప్పారు. జగన్ ప్రభుత్వం పై నమ్మకం లేదని కుటుంబ సభ్యులే చెప్పడం ఈ పరిపాలన తీరుకు నిదర్శనమన్నారు. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని జగన్ ప్రకటించేవరకు తమ నిరసనలు ఆగవని వారు తెలిపారు.
'జగన్ పరిపాలనపై కుటుంబసభ్యులకే నమ్మకం లేదు'
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడికొండ అడ్డరోడ్డులో 26 వ రోజు రైతులు ధర్నాలు కొనసాగించారు. అమరావతే రాష్ట్ర రాజధాని అని ప్రభుత్వం ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చిచెప్పారు.
'జగన్ పరిపాలనపై కుటుంబసభ్యులకే నమ్మకం లేదు'