తానేప్పుడూ నామినేటెడ్ పోస్టులు కోరుకోలేదని సురభి వాణీదేవి పేర్కొన్నారు. ప్రజల మద్దతుతోనే చట్టసభలకు వెళ్తానని స్పష్టం చేశారు. గెలుపు, ఓటములపై విపక్షాలు వంకరగా మాట్లాడవద్దని కోరారు. తన గెలుపును పట్టభద్రులైన ఓటర్లే నిర్ణయిస్తారని అన్నారు.
'నేనెప్పుడూ నామినేటెడ్ పోస్టులు కోరుకోలేదు'
నామినేటెడ్ పోస్టులు తాను కోరుకోలేదని.. ప్రజల మద్దతుతోనే చట్టసభకు వెళ్తానని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి ధీమా వ్యక్తం చేశారు. తమ కుటుంబం ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని.. కష్టపడకుండా ఏదీ రావాలని ఆశించలేదన్నారు. రాజకీయాలు, ప్రజా సేవ తనకేమి కొత్త కాదని.. మరింత విస్తృతంగా చేసేందుకే పోటీ చేస్తున్నానంటున్న సురభి వాణీదేవితో ఈటీవీ భారత్ ప్రతినిధి నాగేశ్వరాచారి ముఖాముఖి.
'నేనెప్పుడూ నామినేటెడ్ పోస్టులు కోరుకోలేదు'
నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై అవగాహన ఉందని చెప్పారు. నిరుద్యోగులు, ఉద్యోగులకు అనేక సమస్యలున్నాయని పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని వెల్లడించారు. కేసీఆర్ తనపై నమ్మకం ఉంచే అభ్యర్థిగా ఎంపికచేశారని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :ప్రాంతీయ రింగు రోడ్డుకు కేంద్రం ఆమోదం
Last Updated : Mar 7, 2021, 6:05 AM IST