తెలంగాణ

telangana

ETV Bharat / state

50 రోజుల తర్వాత సబ్​ రిజస్ట్రార్​ కార్యాలయాలు ప్రారంభం - తెలంగాణలో సబ్​ రిజస్ట్రార్​ కార్యాలయాలు ప్రారంభం

50 రోజుల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 141 కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు రిజిస్ట్రేషన్​ శాఖ ప్రకటించింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆ శాఖ డీఐజీ సుబ్బారావు పేర్కొన్నారు. అదేవిధంగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు registration.telangana.gov.in అను వెబ్ సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

50 రోజుల తర్వాత సబ్​ రిజస్ట్రార్​ కార్యాలయాలు ప్రారంభం
50 రోజుల తర్వాత సబ్​ రిజస్ట్రార్​ కార్యాలయాలు ప్రారంభం

By

Published : May 11, 2020, 7:45 PM IST

50 రోజులు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు తెరచుకున్నాయి. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్లు రిజిస్ట్రేషన్‌ శాఖ వెల్లడించింది. దస్తావేజుల రిజిస్ట్రేషన్‌లు, స్టాంపుల అమ్మకం, ఈసీ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని ఆ శాఖ డీఐజీ సుబ్బారావు తెలిపారు.

కోవిడ్‌-19ను దృష్టిలో ఉంచుకుని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. ఎలాంటి ఇబ్బందులు లేవని శానిటైజర్‌, సబ్బులు కూడా ఏర్పాటు చేశామని సుబ్బారావు పేర్కొన్నారు. అదేవిధంగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు registration.telangana.gov.in అను వెబ్ సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

స్టాంపు డ్యూటీ, ఇతర సుంకాలు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించి.. ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారో ఆ రోజుకు ఆన్ లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సబ్‌ రిజిస్ట్రార్‌ నిర్దేశించిన తేదీన సంబంధిత కార్యాలయానికి వెళ్లడానికి అనుమతి పత్రం కూడా ఆన్‌లైన్‌ ద్వారానే పంపిస్తాం. సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఎక్కడైనా పోలీసులు అభ్యంతరం చెబితే ఆన్‌లైన్‌ ద్వారా జారీ అయిన పాస్‌ వారికి చూపిస్తే సరిపోతుంది.

-సుబ్బారావు, రిజిస్ట్రేషన్​ శాఖ డీఐజీ

50 రోజుల తర్వాత సబ్​ రిజస్ట్రార్​ కార్యాలయాలు ప్రారంభం

ఇదీ చూడండి:కరోనాను జయించిన వారి సాయంతో వైరస్​కు కళ్లెం!

ABOUT THE AUTHOR

...view details