ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాం కళాశాల ముందు విద్యార్థుల ధర్నా - తెలంగాణ వార్తలు

నిజాం కళాశాల వసతి గృహాన్ని తెరవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. బషీర్​బాగ్​లోని నిజాం కాలేజీ ముందు బైఠాయించారు. విద్యార్థులకు నచ్చజెప్పినా వినకపోవడం వల్ల పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

students-protest-at-nizam-college-in-hyderabad
నిజాం కళాశాల ముందు విద్యార్థుల ధర్నా
author img

By

Published : Dec 29, 2020, 1:48 PM IST

నిజాం కళాశాల వసతి గృహాన్ని తెరవాాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బషీర్​బాగ్​లోని నిజాం కాలేజ్ ముందు విద్యార్థులు బైఠాయించారు. విద్యార్థుల ఆందోళనతో బషీర్​బాగ్ నుంచి ట్యాంక్ బండ్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అబిడ్స్ పోలీసులు అక్కడికి చేరుకుని... ప్రిన్సిపల్​తో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యార్థులు మొండిగా రోడ్డుపైనే కూర్చోవడంతో... వారిని అరెస్టు చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

in article image
నిజాం కళాశాల ముందు విద్యార్థుల ధర్నా

వసతి గృహం తెరవకపోవడం వల్ల వివిధ గ్రామాల నుంచి వచ్చిన తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై నిజాం కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని... తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. విద్యార్థులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్న ప్రిన్సిపల్​ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:2020 రౌండప్​: కరోనా కాటేసినా.. నిలబడ్డ నిర్మాణరంగం

ABOUT THE AUTHOR

...view details