ప్రభుత్వం ఆశా కార్మికుల జీతాలను తక్షణమే పెంచాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గుర్రం శంకర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్‌లో ఆశా వర్కర్లకు అనిల్ కుమార్ యాదవ్ నిత్యావసర సరకులు అందజేశారు.
ఆశావర్కర్లకు సరకులు పంపిణీ చేసిన అనిల్‌కుమార్ యాదవ్ - lockdown
హైదరాబాద్ గాంధీనగర్‌లో ఆశావర్కర్లకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆశావర్కర్ల జీతాలను పెంచాలని డిమాండ్ చేశారు.
![ఆశావర్కర్లకు సరకులు పంపిణీ చేసిన అనిల్‌కుమార్ యాదవ్ state youth congress president groceries distribution in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7120741-227-7120741-1588961661732.jpg)
ఆశావర్కర్లకు సరకులు పంపిణీ చేసిన అనిల్‌కుమార్ యాదవ్
కొవిడ్-19 వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశా వర్కర్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి... తక్షణమే వారి జీతాలు రెండింతలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు