తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫిరాయింపుల బెడద.. కాంగ్రెస్ కొత్త పంథా

పార్టీ ఫిరాయింపుల బెడద నుంచి బయట పడేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌ కొత్త తరహా విధానానికి తెరతీసింది. ఆశావహుల అందరితో నామినేషన్లు వేయించిన కాంగ్రెస్‌.. పరిశీలన తరువాతనే అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడమని స్పష్టం చేస్తూ.. అఫిడవిట్‌ ఇచ్చిన వారికే పార్టీ బీ- ఫారాలు దక్కుతాయని హస్తం పార్టీ పేర్కొంది.

congress
కాంగ్రెస్ కొత్త పంథా

By

Published : Jan 10, 2020, 7:07 PM IST

పురపాలక ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుకొస్తున్న ఆశావహులను ఎవరిని కూడా నిరుత్సాహ పరచకుండా నామినేషన్లు వేయమని సూచించింది కాంగ్రెస్. ఈ మేరకు ఆశావహులు భారీగా నామినేషన్లు వేశారు. కొన్ని వార్డు, డివిజన్లల్లో అయిదుగురు బరిలో ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

బాండ్​ రాసిస్తేనే.. బీ ఫారం

ప్రతి వార్డులో అభ్యర్థి ఉండాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ... నామినేషన్ల పరిశీలన పూర్తయి.. గెలుపొందిన తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడమని చెబుతూ రూ.20 స్టాంపుపేపర్‌పై అఫిడవిట్‌ ఇచ్చిన వారికే పార్టీ బీ ఫారాలు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఇబ్బడిముబ్బడిగా నామినేషన్లు వేయించినప్పటికీ... ప్రతి వార్డు, డివిజన్​లో ఒకరిని మాత్రమే పోటీలో ఉంచి వారికి మాత్రమే బీ-ఫారం ఇస్తారు.

విధేయులు, ప్రజాధారణ కలిగిన వారికే..

నామినేషన్లు వేసిన వారిలో పార్టీకి విధేయులుగా, ప్రజాదరణ కలిగి ఉండి... అధికార పార్టీ అభ్యర్థితో దీటుగా ఎదుర్కొని విజయం సాధిస్తారన్న వారి అఫిడవిట్ తీసుకుని బీ- ఫారం ఇస్తారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు నామినేషన్ల ప్రక్రియకు తగినంత వ్యవధి లేకపోవడం... పార్టీలో పోటీ అధికంగా ఉండడం లాంటి కారణాలతో ఈ కొత్తతరహా విధానానికి తెరతీసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కొత్త పంథాకు నాంది..

మొత్తం 120 పురపాలక, 10 కార్పొరేషన్ల పరిధిలో అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు స్థానికులకే బాధ్యతలు అప్పగించారు. ఈ కారణంగా పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకునే నేతలే బరిలో నిలుస్తారని ఆశావహుల బెడద పోతుందని... అందరితో నామినేషన్లు వేయించి... కొత్త తరహా విధానానికి నాంది పలికింది.

ఇప్పటికే డీసీసీలకు చేరిన బీ- ఫారాలను రేపు నామినేషన్ల పరిశీలన పూర్తికాగానే పంపిణీ చేయనుంది. ఇందుకోసం పీసీసీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది.

ఇవీ చూడండి: తెరాసను ఓడించి కేసీఆర్​కు ఝలక్ ఇద్దాం : ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details