కరోనా మహమ్మారిని కట్టడి చేసే దిశలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినప్పటికీ నిత్యావసర సరుకుల రవాణాకు ఎటువంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో దేశంలోని పలు నగరాలకు పార్సల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించింది.అందులో భాగంగా ఏప్రిల్ 2న సికింద్రాబాద్ నుంచి హౌరాకు కాజీపేట, విజయవాడ , రాజమండ్రి, అనకాపల్లి మార్గంలో ప్రత్యేక పార్సల్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. నిత్యావసర సరకుల రవాణా ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని రైల్వే అధికారులు నిర్ణయించారు. సరకులు సాఫీగా అంతరాయం లేకుండా గమ్యస్థానాలకు చేరేందుకు రైల్వే సిబ్బంది స్థానిక రాష్ట్ర ప్రభుత్యాలు, పోలీసు శాఖ అధికారులతో కూడా సమన్వయం చేసుకున్నారు. రైల్వే అధికారులు.. సిబ్బంది సమిష్టి కృషి వల్ల సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 3,005 ప్యాకేజీలతో 91.7 టన్నుల లోడ్‌తో ప్రత్యేక పార్సల్ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది.
నిత్యావసర సరకుల రవాణా కోసం పార్సల్ రైళ్లు - దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రైళ్లను రద్దు చేసినప్పటికీ సరకుల రవాణాకు ఎటువంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యే పార్సల్ రైళ్లను ప్రారంభించింది. అందులో భాగంగానే 91.7 టన్నుల లోడ్‌తో ప్రత్యేక పార్సల్ రైలు సికింద్రాబాద్ నుంచి హౌరాకు బయలుదేరింది.

ఈ రైలులో గుడ్లు , చాక్లెట్లు , బిస్కెట్లు , బట్టలు , మందులు , వైద్య పరికరాలు , యంత్రాల విడిభాగాలు,పుచ్చకాయలు , మామిడి పండ్లు , ఐస్‌లో ఉంచిన చేపల పెట్టెలను రైలులో తరలించారు. కరోనా నేపథ్యంలో సరుకుల లోడింగ్‌కు ముందే పార్సల్ వ్యాన్లను పరిశుభ్ర పరిచారు. సరకు ఎక్కించే ముందు సిబ్బంది సామాజిక దూరం పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. పార్సల్ ఎక్స్ ప్రెస్‌కి అత్యధిక ప్రాధాన్యమిచ్చి , సుస్థిరమైన పర్యవేక్షణతో సరకు తరలించారు. సాధారణంగా కార్గో రైళ్ల వేగం గంటకు 30 కి.మీ అయినప్పటికీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ రైలును గంటకు 55 కి.మీ వేగంతో నడిపించారు.
ఇవీ చూడండి: మోదీ పిలుపులో భాగమవుదాం... దీపాలు వెలిగిద్దాం: సీఎం