పీజీ మెడికల్ కోర్సుల రుసుము పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నిమిత్తం హైకోర్టులో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం దీనిపై బుధవారం విచారణ చేపట్టనుంది. పీజీ మెడికల్ కోర్సుల ఫీజులను పెంచుతూ గత నెల 14న ప్రభుత్వం జారీచేసిన జీవో 20ను సవాలు చేస్తూ డాక్టర్ ఎస్పీ సుదీప్‌శర్మ, మరో 120 మంది పిటిషన్ దాఖలు చేశారు.
పీజీ మెడికల్ కోర్సుల రుసుము పెంపుపై ప్రత్యేక ధర్మాసనం
పీజీ మెడికల్ ఫీజుల పెంపు వ్యాజ్యంపై విచారణకు హైకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్ ధర్మాసనం పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టనుంది.
టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్ మెమోతో జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావుతో కూడిన ధర్మాసనం విచారణ నుంచి వైదొలగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ధర్మాసనం ముందు పిటిషన్‌పై విచారణను అత్యవసరంగా చేపట్టాలంటూ మంగళవారం పిటిషనర్ తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి అభ్యర్థించారు. విచారణ నుంచి తప్పుకొంటానని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ప్రకటించటంతో.. అత్యవసరమైతే ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి పిటిషనర్ తరఫు న్యాయవాదికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ప్రత్యేక ధర్మాసనం పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టనుంది.
ఇదీ చూడండి :వరి ధాన్యం కొనుగోలులో జాప్యంతో రైతు ఆత్మహత్యాయత్నం