ప్రత్యేక రాష్ట్రం వచ్చినా ఒక ప్రాంతం (ఆంధ్ర) వారికే సమావేశ మందిరాలు కేటాయిస్తూ... తెలంగాణ వారికి వివక్ష చూపుతున్నారని యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రభారతి ముందే బైఠాయించడం వల్ల... పాశం యాదగిరిని సైఫాబాద్ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
దత్తాత్రేయకు ప్రొటోకాల్ పాటించలేదని పాత్రికేయుడి ధర్నా - సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి ఆందోళన
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ప్రొటోకాల్ పాటించడం లేదని సీనియర్ పాత్రికేయుడు పాశం యాదగిరి ఆందోళనకు దిగారు. ఓ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా పిలిచి.. బ్యానర్‌పై దత్తాత్రేయ పేరు, ఫొటో పెట్టకపోవడం వల్ల నిర్వాహకులను నిలదీశారు.
దత్తాత్రేయకు ప్రొటోకాల్ పాటించలేదని పాత్రికేయుడి ధర్నా