సచివాలయం కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ తుది దశకు చేరింది. మూడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో ఇవాళ వాదనలు ముగిశాయి. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెజస ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఇరువైపుల వాదనలు ముగిశాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యాజ్యంపై రేపు వాదనలు ముగిస్తామని హైకోర్టుకు పిటిషనర్ తరఫున న్యాయవాది రచన తెలిపారు. పిటిషనర్లు రాజకీయ దురుద్దేశాలతో వ్యాజ్యాలు దాఖలు చేశారని అడ్వొకేట్ జనరల్ వాదించారు. ప్రభుత్వం తీసుకునే రాజ్యాంగబద్ధమైన నిర్ణయాలపై కోర్టులు న్యాయ సమీక్ష చేయరాదని ఏజీ పేర్కొన్నారు.
సచివాలయం కూల్చివేత వ్యాజ్యాలపై తుదిదశకు చేరిన విచారణ - mp revanth reddy
సచివాలయం కూల్చివేతపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ తుదిదశకు చేరింది. పిటిషనర్లు రాజకీయ దురుద్దేశంతో పిల్ దాఖలు చేశారని ఏజీ వాదించగా... ప్రభుత్వ నిర్ణయాలు సహేతుకంగా లేనప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు.
సచివాలయం కూల్చివేత వ్యాజ్యాలపై తుదిదశకు చేరిన విచారణ
ఇంగ్లండ్, అమెరికా వంటి దేశాల్లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లో కూడా కార్యాలయాలు కొనసాగుతున్నాయని జీవన్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సత్యం రెడ్డి వాదించారు. మరమ్మతులు చేసే అవకాశమున్నప్పటికీ.. కూల్చివేయాలనుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు సహేతుకంగా లేనప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని పీఎల్ విశ్వేశ్వరరావు తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు.
ఇవీ చూడండి:ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది: ఈటల